Telugu News » అమ్మ దొంగా..! చీరకు బంగారం స్ప్రే చేశావా…!?

అమ్మ దొంగా..! చీరకు బంగారం స్ప్రే చేశావా…!?

దాదాపు అరకేజీ బంగారాన్ని గుట్టుచప్పుడు రవాణా చేసేందుకు స్మార్ట్ వర్క్ చేశాడో స్మగ్లర్. ఏం చేశాడంటే..461 గ్రాముల బంగారాన్ని చీరకి చేశాడు

by sai krishna

నిండా మునిగిన వాడికి చలేంటి..!ఒప్పుకున్న సరుకుని కస్టమ్స్ వాళ్ల కళ్లుగప్పి ఎలాగైనా దేశం దాటించాలి. మాదక ద్రవ్యమో, ధగధగలాడే బంగారమో..! వామ్మో అనిపించే వజ్రమో..! ఇలా ఏదో ఒకటి. దేశం నుంచిదేశానికి బదిలీ చెయ్యాలి.

బదులుగా వాళ్లకేదో ముడుతుంది.తేడా వస్తే జైలు జీవితం ఖాయమవుతుంది. అయినా.!స్మగ్లింగ్ షురూ అవుతుంది.ఈ సారి బంగారం వంతు వచ్చింది. అయితే ఇదేదో డొమెస్టిక్ స్మగ్లింగ్ లా ఉంది. ఏదైతేనేం స్మగ్లింగే కదా..!

దాదాపు అరకేజీ బంగారాన్ని  దుబాయ్  నుంచి గుట్టుచప్పుడు రవాణా చేసేందుకు  స్మార్ట్ వర్క్ చేశాడో స్మగ్లర్. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఇంతకీ  ఏం చేశాడంటే..461 గ్రాముల బంగారాన్ని చీరకు స్ప్రే చేశాడు. అయితే మిషన్ అరిచింది.


ఇదేంటని అడిగారు అధికారులు …చీరకు బంగారం స్ప్రేచేశానని సింపుల్ గా చెప్పాడు. అదిగో అక్కడే మన అధికారులకి అనుమానం వచ్చింది. బ్యాగ్ లోని బట్టలు బయటకు తీయించారు. తనిఖీ చేయడంతో స్మగ్లర్ దొరికేశాడు.

ఆ చీరకు పూసిన బంగారం సుమారు 28.01 లక్లల ఖరీదు ఉంటుంది. కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు దేశంలో పలుచోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

బంగారం రవాణాకు స్మగ్లర్ ఎన్నుకునే మార్గాలలో విమానాశ్రయం మొదటి స్టానంలో ఉంటుంది. కానీ, ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్న, చేసేది తప్పని పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసినా కూడా స్మగ్లర్లు మాత్రం వాళ్ళ తీరుని మార్చుకోవడం లేదు.

You may also like

Leave a Comment