Telugu News » ఎయిర్‌ హోస్టెస్ హత్య కేసు నిందితుడు ఆత్మహత్య!

ఎయిర్‌ హోస్టెస్ హత్య కేసు నిందితుడు ఆత్మహత్య!

నిందితుడు తన ప్యాంట్ తో జైలు టాయిలెట్ లో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

by Sai
man in mumbai who killed air hostess died bu suicide in jail

ఎయిర్‌ హోస్టెస్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. శిక్షణ తీసుకుంటున్న రూపాల్‌ ను ఆమె ఫ్లాట్‌ లో పని చేస్తున్న విక్రమ్‌ అత్వాల్‌ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించి కుదరకపోయేసరికి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న విక్ర‌మ్‌.. తాను ఉంటున్న జైలులోనే ఉరివేసుకున్నాడు.

man in mumbai who killed air hostess died bu suicide in jail

నిందితుడు తన ప్యాంట్ తో జైలు టాయిలెట్ లో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూపాల్‌ ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్ సంస్థ‌లో శిక్ష‌ణ కోసం ఆమె ముంబైకి వెళ్లింది. ఏడాది కాలం నుంచి విక్ర‌మ్ అత్వాల్‌.. రూప‌ల్ ఓగ్రే ఇంట్లోనే హౌజ్‌కీపింగ్ ప‌నిచేస్తున్నాడు.

విక్రమ్ అత్యాచారం చేయబోతుంటే రూపాల్ అతనితో తీవ్రంగా పోరాడి అతని చేతిలో హత్యకు గురైంది. బాధితురాలి గొంతు కోసిన విక్ర‌మ్ ఆమె శ‌రీరాన్ని బాత్రూమ్‌లో పడేశాడు. దుస్తులు మార్చుకుని అత‌ను అక్క‌డ నుంచి పారిపోయాడు.

సీసీటీవీ కెమెరాల‌కు ఆ నిందితుడు చిక్కాడు. మ‌ధ్యాహ్నం 11.30 నిమిషాల నుంచి 1.30 నిమిషాల వ‌ర‌కు ఓగ్రే ఫ్లాట్‌లోనే అత్వాల్ ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఓగ్రే ఎంత‌కీ ఫోన్ తీయ‌కపోవ‌డంతో.. కీ మేక‌ర్ ద్వారా ఇంటి డోర్ తీశారు. ర‌క్త‌పు మ‌డుగులో ఓగ్రే శ‌రీరాన్ని గుర్తించారు. మ‌ర్డ‌ర్‌కు వాడిన క‌త్తి, నిందితుడి దుస్తుల్ని హౌజింగ్ సొసైటీ స‌మీపంలో ఉన్న పొద‌ల్లో రిక‌వ‌రీ చేశారు.

You may also like

Leave a Comment