Telugu News » Congress : కాంగ్రెస్ నేతల కీలక సమావేశం.. ఆ నియోజకవర్గ అభ్యర్థి గెలుపుకోసం కృషి..!

Congress : కాంగ్రెస్ నేతల కీలక సమావేశం.. ఆ నియోజకవర్గ అభ్యర్థి గెలుపుకోసం కృషి..!

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.. రుణమాఫీ కూడా చేస్తాం అని వివరించారు.. వంద రోజుల్లోనే హామీలు అమలు చేయడం లేదనీ రాజకీయాలకు కొత్తగా వచ్చిన వారు అడిగితే బాగుంటదని తెలిపారు.

by Venu
Congress graph down in Malkajigiri.. What is in the report of strategist Sunil Kanugulu?

మంచిర్యాల (Mancherial) ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసంలో పెద్దపల్లి (Peddapally) పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రమణ రావు, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజక వర్గంకు కాకా ఎన్నో సేవలు చేశారన్నారు..

ఇప్పటికే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజల కోసం వంశీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయనకు టికెట్ కేటాయింపు జరిగినట్లు వెల్లడించారు.. వంశీ గెలుపు కోసం మేము అందరం కలిసికట్టుగా పని చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.. ఇక బీఆర్ఎస్ (BRS) చేస్తున్న ఆరోపణలపై స్పందించిన శ్రీధర్ బాబు సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలేదు..

ఆ సమయంలో అధికారంలో ఎవరున్నారనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చింది డిసెంబర్ కదా అని గుర్తు చేశారు.. బీఆర్ఎస్ కు వాటర్ ప్లానింగ్ లేదని ఆరోపించిన మంత్రి.. కేసీఆర్ హయాంలో ప్రతి రైతుకు అన్యాయం జరిగిందని విమర్శించారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం ఐకెపి సెంటర్లను ఏర్పాటుచేసి.. ఒక్కగింజ లేకుండా కొనాలని ఆదేశించినట్లు తెలిపారు.

మరోవైపు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.. రుణమాఫీ కూడా చేస్తాం అని వివరించారు.. వంద రోజుల్లోనే హామీలు అమలు చేయడం లేదనీ రాజకీయాలకు కొత్తగా వచ్చిన వారు అడిగితే బాగుంటదని తెలిపిన శ్రీధర్ బాబు.. పదేండ్లు అధికారంలో వున్న బీఆర్ఎస్ నేతలు అడగడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. మరోవైపు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచినట్టు వంశీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తామని వెల్లడించారు..

అలాగే ఎమ్మెల్యే విజయ రమణ రావు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని జనాలు ఆలోచన చేస్తున్నారని తెలిపిన ఆయన.. పేద ప్రజలను మోడీ, కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. మా పాలన వల్ల పంటలు ఎండి పోలేదు… వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి.. కానీ కేసీఆర్ రైతులపై ముసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు.

మరోవైపు ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. మా కుటుంబ సభ్యుడికి పార్లమెంట్ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలని పేర్కొన్నారు. వంద రోజులలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మమ్ములను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కాకా కుటుంబంకు పెద్దపల్లి టికెట్ రావడం మంచి పరిణామని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు..

You may also like

Leave a Comment