Telugu News » Manipoor : మణిపూర్‌లో ఆరని మంటలు.. ఇద్దరు మృతి.. 25మందికి గాయాలు..!

Manipoor : మణిపూర్‌లో ఆరని మంటలు.. ఇద్దరు మృతి.. 25మందికి గాయాలు..!

రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడుతున్న సాయుధ వ్యక్తులతో చురచంద్‌పూర్ జిల్లాకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్‌ ఈ నెల 14న సెల్పీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

by Venu

Manipoor : మణిపూర్‌లో ఆరని మంటలు.. ఇద్దరు మృతి.. 25మందికి గాయాలు..!ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌ (Manipoor)లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ (Kukee), జో తెగలు అధికంగా ఉండే చురచంద్‌పూర్‌ (Churachandhpoor) జిల్లాలో నిన్న అర్ధరాత్రి పోలీస్ సూపరిండెంట్ కార్యాలయంపై వందలాది మంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 25మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడుతున్న సాయుధ వ్యక్తులతో చురచంద్‌పూర్ జిల్లాకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సియామ్‌లాల్‌పాల్‌ ఈ నెల 14న సెల్పీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జిల్లా ఎస్పీ శివానంద్ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో సస్పెండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు..

అంతటితో ఆగకుండా.. ఎస్పీ కార్యాలయంపై సుమారు 400 మందితో కూడిన సాయుధ గుంపు దాడికి పాల్పడింది. ఆఫీస్‌లోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేశారు. రాళ్లతో దాడికి దిగడంతో భద్రతా బలగాలు ఆందోళన కారులపైకి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ఈ క్రమంలోనే ఇద్దరు మరణించగా.. 25 మందికి పైగా గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోని, వెంటనే హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఆందోళన కారులు తెలిపారు..

ఇది జరగకుంటే.. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. కాగా తాజాగా జరిగిన ఈ ఘటనకు ఎస్పీ శివానంద్ బాధ్యత వహించాలని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ITLF) పేర్కొంది. మరోవైపు గతేడాది మే నుంచి మణిపూర్‌లో కుకీ-జో తెగలు, మైతీ (Maithee)ల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. తొమ్మది నెలలుగా సాగుతున్న ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించగా..1100 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. సుమారు 65వేల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళినట్లు సమాచారం.

You may also like

Leave a Comment