Telugu News » UK: బ్రిటన్‌పై భారత విద్యార్థుల విముఖత.. భారీగా తగ్గిన వీసా దరఖాస్తులు..!

UK: బ్రిటన్‌పై భారత విద్యార్థుల విముఖత.. భారీగా తగ్గిన వీసా దరఖాస్తులు..!

బ్రిటన్‌(Britain)లో అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అక్కడ చదివేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. గతేడాదితో పోలిస్తే ఈమారు బ్రిటన్‌లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య 4 శాతం తగ్గి 8,770కు పరిమితమైంది.

by Mano
UK: Reluctance of Indian students to Britain.. Huge reduction in visa applications..!

బ్రిటన్‌(Britain)లో అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అక్కడ చదివేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. యూకే(UK)లోని యూనివర్సిటీస్ అండ్ కాలేజస్ అడ్మిషన్స్ సర్వీసెస్ విభాగం (UCAS) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

UK: Reluctance of Indian students to Britain.. Huge reduction in visa applications..!

వీసా పథకంలో విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మరో రెండేళ్ల పాటు బ్రిటన్‌లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక బ్రిటన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులకు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునే అవకాశం లేదు. గత నెలలోనే ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు.

మరోవైపు, గ్రాడ్యుయేట్ వీసాల జారీని సమీక్షిస్తామని రిషి సునాక్ ప్రభుత్వం ప్రకటించడమే భారతీయ విద్యార్థుల విముఖతకు కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, బ్రిటన్‌లో ఈ ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగినా భారతీయుల దరఖాస్తులు మాత్రం తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈమారు బ్రిటన్‌లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య 4 శాతం తగ్గి 8,770కు పరిమితమైంది.

అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఈ మారు 0.7 శాతం పెరిగింది. నైజీరియా విద్యార్థుల దరఖాస్తులు ఏకంగా 46 శాతం మేర తగ్గి 1,590కు చేరుకున్నాయి.  చైనా విద్యార్థుల దరఖాస్తులు అత్యధికంగా గతేడాది కంటే 3 శాతం పెరిగి 910కు చేరాయి. తుర్కియే, కెనడా విద్యార్థుల దరఖాస్తులూ పెరిగాయి.

You may also like

Leave a Comment