Manipur : మణిపూర్ రావణ కాష్టం వెనుక చడీ చప్పుడు చేయని మాదక ద్రవ్య మారణ హోమం దాగుందంటే నమ్మలేం.ఎవరూ ఊహించని ఈ ‘భూతం’ రాష్ట్రానికి శాపంలా మారింది. మణిపూర్ హింస వెనుక మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగం దాగుంది. గంజాయి, నల్ల మందు, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలు మార్కెట్లో నిత్యావసర వస్తువుల్లా దొరుకుతున్నాయి. చివరకు హైస్కూలు స్టూడెంట్స్ కూడా వీటికి అలవాటు పడిపోతున్నా.. పట్టించుకుంటున్న అధికార యంత్రాగం లేదు. ఎరుపు, తెల్లని రంగుల పౌడర్ మిశ్రమాన్నేఇక్కడ ‘థుమ్ మొరోక్’ అనే వాడుక భాషలో వ్యవహరిస్తున్నారు. ఉప్పు, కారం కలగలిపిన ఈ మిశ్రమాన్ని ‘నెంబర్ 4’ హెరాయిన్ గా పిలుస్తున్నారు.
మత్తు కల్గించే ఈ మిశ్రమం ఉనికి నిజానికి మయన్మార్ లోనిది. పొరుగునున్న ఆ దేశంలో డ్రగ్ లార్డ్ ఖున్ సా అనే వ్యక్తి ఏకంగా ఫ్యాక్టరీల్లోనే ఈ మాదకద్రవ్యాన్ని తయారు చేస్తున్నాడు. షా స్టేట్ ఆర్మీకి చెందిన ఖున్ సా .నిర్వహిస్తున్న ఫ్యాక్టరీల్లో . ప్రపంచంలో హెరాయిన్ ఉత్పత్తి చేసే దేశాల్లో 25 శాతం వీటిలోనే భ్యమవుతోంది. ఈశాన్య ఏసియాలో గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతం నుంచి వచ్చిన ఇతనికి 10 వేల మందితో కూడిన సాయుధ దళం కూడా ఉంది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో ‘నెంబర్ 4’ హెరాయిన్ మయన్మార్ నుంచి మణిపూర్ లో అడుగు పెట్టింది. ఈ రాష్ట్రంలో లోకల్ గా మొబైల్ ఫ్యాక్టరీల్లోనూ, చిన్నపాటి ఉత్పాదక యూనిట్లలోనూ దీన్నిఉత్పత్తి చేస్తున్నారు. ఒక గ్రాముకు వంద రూపాయల్లోపే దీని ఖరీదు. మాదకద్రవ్యాలకు అలవాటుపడిపోతున్నవారి సంఖ్య రాష్ట్రం లోని పునరావాస కేంద్రాల్లో పెరిగిపోతోంది. సుమారు ఇలాంటి 105 కేంద్రాలు వీరితో కిక్కిరిసిపోతున్నాయి. ఒకప్పుడు 20-21 ఏళ్ళ వయస్సులోనివారు హెరాయిన్ కి అలవాటు పడగా ఇప్పుడు 14-15 సంవత్సరాల నూనూగు మీసాలవారు కూడా మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారు.
తాము మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రకటించామని రాష్టం లోని బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయిని, నల్లమందును ‘పంటలు’గా పండిస్తున్న ‘రైతులు’ కూడా పెరిగిపోతున్నారు. కొండ ప్రాంతాల్లోని రైతులు వీటిని పండిస్తున్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదని కుకీలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో వీరు కూడా
తామూ ఏం తక్కువ తినలేదన్నట్టు ‘హెరాయిన్, నల్లమందు’ పంటలను పండిస్తుండడంతో.. 15 వేల ఎకరాల్లోని ఈ పంటలను నాశనం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది.
2017 నుంచి ఇప్పటివరకు మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించి రెండున్నరవేలమందికి పైగా అరెస్టయ్యారు. కానీ ఇంత చేస్తున్నా మాదకద్రవ్యాలు ఇంకా లభిస్తూనే ఉన్నాయి. థాయిలాండ్, లావోస్, మయన్మార్ వంటి ప్రాంతాల నుంచి ఇవి మణిపూర్ చేరుతూనే ఉన్నాయి. పటిష్టమైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో ఇవి నిరాటంకంగా ఇక్కడికి రవాణా అవుతున్నాయి. కాంగ్ పోక్పి జిల్లాను ఓ జర్నలిస్టుల బృందం సందర్శించినప్పుడు రైతులు ఈ అక్రమ పంటల గురించి బాహాటంగానే చర్చించుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. రెండేళ్ల క్రితం తమ వరి పంటలను నష్టపోవడంతో తాము ఇక గంజాయి, ఓపియం పంటలను పండించక తప్పలేదని రైతులు కొందరు నిర్భయంగా చెప్పారు. ఇక నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగానే ఉండడంతో యువత కూడా ఇలాంటి అక్రమ పంటల పట్ల మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చే ఈ పంటలను పండించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.