తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల (IAS)ను ప్రభుత్వం (Governament) బదిలీ చేసింది. పలువురు అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తాజాగా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్ గా ఆమ్రపాలిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల కేంద్రం సర్వీసుల నుంచి ఆమె రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. రాష్ట్రానికి వచ్చి రాగానే ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇక ఇరిగేషన్ సెక్రెటరీగా రిజ్వీ ని నియమిస్తున్నట్టు తెలిపింది.
రిజ్వీకి అదనంగా ట్రాన్స్ కో – జెన్ కో చైర్మన్, ఎండీగా బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సందీప్ కుమార్ జా, డిప్యూటీ సీఎం ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా కృష్ణ భాస్కర్‌ను నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ, టీఎస్ఎన్ పీడీసీఎల్ వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి, అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బీ.గోపిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.