హైదరాబాద్(Hyderabad), వైజాగ్(Vizag)లో మారథాన్ సందడి నెలకొంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో ఆదివారం ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’(Hyderabad of Marathon) నిర్వహించారు. అదేవిధంగా వైజాగ్‌లో నేవీ మారథాన్ జరిగింది. ఆయా చోట్ల పెద్దఎత్తున యువత హాజరై ఉత్సాహంగా పరుగులు తీశారు. 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్ పోటీలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ముఖ్య అతిథి హాజరు కావడం విశేషం. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో సహా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచిన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. మరోవైపు మారథాన్‌లో విజేతలకు సచిన్ బహుమతులు అందజేసి అభినందించారు.
అదేవిధంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో 8వ ఎడిషన్ నేవి మారథాన్ ఘనంగా ప్రారంభమైంది. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీలలో మారథాన్‌ను నిర్వహించారు. ఫుల్ మారథాన్‌ను వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కార్ జెండా ఊపి ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌ను వైస్ అడ్మిరల్ శ్రీనివాసన్ జెండా ఊపి ప్రారంభించారు. వైజాగ్ నేవీ మారథాన్ 2023లో 10కే రన్‌ను విశాఖపట్నం సీపీ డా.ఏ రవిశంకర్ ప్రారంభించారు.
విశాఖ వాసులు పెద్ద ఎత్తున ప్రజలు బీచ్‌కు చేరుకుని మారథాన్‌లో పాల్గొన్నారు. నేవీ మారథాన్‌తో ఆర్కే బీచ్ సందడిగా మారింది. వైజాగ్ మారథాన్ 2023 పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖ నగర ప్రాముఖ్యతను తెలపడానికి ఈ మారథాన్ ఎంతగానో ఉపయోగపడతుందని నేవీ అధికారులు తెలిపారు.