Telugu News » Mass Shooting: ఆకలితో ఉన్న అభాగ్యులపై కాల్పులు.. 112 మంది మృతి..!

Mass Shooting: ఆకలితో ఉన్న అభాగ్యులపై కాల్పులు.. 112 మంది మృతి..!

పాలస్తీనియన్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గాజాకు సాయం అందించడంపై నిషేధం విధించిన తర్వాత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

by Mano
Mass Shooting: 112 people killed in firing on hungry poor people..!

పాలస్తీనియన్ల(Palestinians) పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గాజా(Gaja)కు సాయం అందించడంపై నిషేధం విధించిన తర్వాత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఆహారం కోసం ఎదురుచూస్తున్న పౌరులపై ఇజ్రాయెల్ ఆర్మీ(Israeli Army) కాల్పులకు తెగబడి అమానుషంగా వ్యవహరించింది.

Mass Shooting: 112 people killed in firing on hungry poor people..!

గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పుల్లో సుమారు 112 మంది మృతిచెందారు. 769 మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత గాజాలో మృతుల సంఖ్య 30 వేలు దాటింది. గాజాలో ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా మరో నలుగురు పిల్లలు మృతిచెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.

ఇజ్రాయెల్ సైన్యంపై జరిగిన ఈ దారుణాన్ని మానవ హక్కుల సంఘాలు, సహాయ బృందాలతో పాటు ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న దేశాలు ఖండించాయి. ఆకలితో అల్లాడుతున్న ప్రజలపై కాల్పులు జరపడాన్ని ఫ్రెంచ్ ప్రధాని, ఈయూ దౌత్యవేత్తలు, అమెరికా సెనేటర్లు కూడా ఖండించారు. కాల్పుల వార్త తర్వాత ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ట్విట్లర్‌లో తన స్పందించారు.

ఇజ్రాయెల్ సైనికులు పౌరులను లక్ష్యంగా చేసుకున్న గాజా నుంచి వస్తున్న చిత్రాలపై కోపంగా ఉంది. పౌరులందరికీ రక్షణ కల్పించాలన్నారు. ఈ మరణాలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు సహాయం గాజాకు ఎలాంటి ఆటంకం లేకుండా చేరాలని జోసెఫ్ ట్విట్టర్‌లో రాశారు. గాయపడిన వారికి చికిత్స చేయడానికి గాజాకు ఆసుపత్రి నౌకను పంపాలని బిడెన్ పరిపాలనను కోరారు.

గాజాకు సాయం అందించేందుకు అమెరికా సముద్ర మార్గాన్నికనుగొనాలని ఓ అమెరికా సెనేటర్ లేఖ రాశారు. మానవతా సహాయం అందించడానికి త్వరలో కాల్పుల విరమణ జరగాలని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ మాట్లాడుతూ ప్రజలకు ఆహారం లేకుండా చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అన్నారు.

You may also like

Leave a Comment