మారిషస్ ప్రభుత్వం (Mauritian government) కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా (inauguration of Ram Temple) సందర్బంగా ఆ రోజు హిందూ ఉద్యోగులకు రెండు గంటల పాటు విరామం ఇవ్వాలని నిర్ణయించింది.
ఆ రెండు గంటల పాటు హిందువులు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేపాల్ తర్వాత హిందూ మతం అధికంగా ఉన్న దేశాల్లో మారిషస్ మూడవ స్థానంలో ఉంది. 2011 గణాంకాల ప్రకారం మారిషస్లో సుమారు 48.5శాతం మంది హిందువులు ఉన్నారు.
జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా కాస్త వెసులుబాటు కావాలని మారిషస్ ప్రభుత్వానికి హిందూ అధికారుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించింది. ఈ మేరకు హిందూ అధికారులకు 2 గంటల విరామం ఇవ్వాలని నిర్ణయించింది.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా సర్వీసు అవసరాలకు లోబడి హిందూ మతానికి చెందిన అధికారులకు జనవరి 22న మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాటు విరామం ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ నేతృత్వంలోని మారిషస్ కేబినెట్ ప్రకటించింది.