Telugu News » Medigadda : మేడిగడ్డపై నడుస్తున్న రాజకీయం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్​..!

Medigadda : మేడిగడ్డపై నడుస్తున్న రాజకీయం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్​..!

సాగు నీరు ఎత్తిపోస్తే పంటలకు లాభం చేకూరుతుందని వివరించారు. మేడిగడ్డ అంశంపై అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన, కమిటీ వేసి నివేదిక తీసుకోవాలని కోరారు.

by Venu
vigilance searches on kaleshwaram projects medigadda barrage issue

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలు ఢీ అంటే ఢీ అంటూ సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో నేడు మేడిగడ్డను బీఆర్​ఎస్​ నేతల బృందం సందర్శించింది. మాజీ మంత్రులు కేటీఆర్ (KTR)​, హరీశ్​రావు (Harish Rao) సహా పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు బ్యారేజీని పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు..

Ktr fire on bjp and Congress

మేడిగడ్డ (Medigadda )లో కనిపించిన చిన్న సమస్యను కాంగ్రెస్ నేతలు భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని పేర్కొన్నారు. తమపై కోపం, రాజకీయ వైరం ఉంటే తీర్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్న కేటీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని ప్రచారం చేయడం తగదన్నారు.

నిపుణులు మేడిగడ్డను మరమ్మతులు చేసే అవకాశం ఉందని తెలిపిన నేపథ్యంలో.. వర్షాకాలం వచ్చేలోగా మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్​ చేశారు. రైతులకు మాత్రం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. కరీంనగర్​లో ఇప్పటికే సాగు నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, ఇతర జిల్లాల్లో సైతం ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయని వెల్లడించారు.

సాగు నీరు ఎత్తిపోస్తే పంటలకు లాభం చేకూరుతుందని వివరించారు. మేడిగడ్డ అంశంపై అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన, కమిటీ వేసి నివేదిక తీసుకోవాలని కోరారు. మాపై కోపం ఉంటే తీర్చుకోండి. రైతులపై కాదు. రైతులు, రాష్ట్రంపై పగ వద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేటీఆర్ వెల్లడించారు. 1.6 కిలోమీటర్ల బ్యారేజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉంది. కాంగ్రెస్ నేతలు ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడటం సరికాదని తెలిపారు.

You may also like

Leave a Comment