తిరుమలలో (Thirumala) ఇవాళ టిటిడి (TTD) పాలకమండలి సమావేశం జరిగింది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో అన్నమయ్య (Annamayya) భవన్ లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. అలిపిరి (Alipiri) వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని, భక్తులకు ముఖ్యమైన రోజులలో హోమంలో స్వయంగా పాల్గోనే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
5 వేల టిటిడి పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచాలని, టిటిడి పరిధిలోని కార్పోరేషన్ లో విధులు నిర్వర్తిస్తూన్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెరిగేలా చూడాలని నిర్ణయించుకొన్నట్టు టిటిడి పాలకమండలి వెల్లడించింది. ఇక ఈఎస్ఐ వర్తించని కార్పోరేషన్ ఉద్యోగులుకు హెల్త్ స్కీం వర్తింప చేయాలని, ఒకవేళ అకాల మరణం సంభవిస్తే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని నిర్ణయించారు.
నారాయణగిరి ఉద్యాణవనంలో కంపార్టుమెంట్ల ఏర్పాటుకు 18 కోట్లు కేటాయించిన టిటిడి.. అన్నమయ్య భవన్ లో హోటల్స్ ని టూరిజం శాఖకు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 40 కోట్ల వ్యయంతో ఆకాశ గంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు, 10.8 కోట్లతో వరహస్వామి అతిధి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు.. 25 కోట్ల వ్యయంతో తిరుపతిలోని చేర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.
తిరుపతిలో టిటిడి అనుభంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాలలో మేరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం.. ఆ భాధ్యతలను టిటిడి పరిధిలోకి తీసుకువస్తామన్నారు. పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటి ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
టిటిడి పరిధిలో ఉన్న పాఠశాల విద్యార్దులుకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించేలా, కళ్యాణ మండపాలలో జరిగే వివాహాల్లో డిజేలకు బదులు లలితా గీతాలు పాడుకోనేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. టిటిడి ఆస్థాన విద్వాంసుడు గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ కి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాని లేఖ రాయాలని పాలకమండలి తీర్మానించింది.