Telugu News » Megastar: మెగాస్టార్‌కు వరించిన ‘పద్మ విభూషణ్’.. ఆయన స్పందన ఇదే..!

Megastar: మెగాస్టార్‌కు వరించిన ‘పద్మ విభూషణ్’.. ఆయన స్పందన ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)కి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మవిభూషణ్’(Padmavibhushan) వరించింది. 75వ గణతంత్ర దినోత్సవ వేళ ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు.

by Mano
Megastar: Megastar's 'Padma Vibhushan'... this is his reaction..!

టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)కి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మవిభూషణ్’(Padmavibhushan) వరించింది. 75వ గణతంత్ర దినోత్సవ వేళ ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. 2006లో భారత ప్రభుత్వం తరఫున అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా చిరంజీవి ‘పద్మభూషణ్’ అందుకున్నారు.

Megastar: Megastar's 'Padma Vibhushan'... this is his reaction..!

 

ఇప్పుడు ‘పద్మవిభూషణ్’ రావడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 45 సంవత్సరాలుగా వెండితెరపై తన నటనతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 150కి పైగానే సినిమాల్లో నటించిన మెగాస్టార్‌కు తాజాగా ‘పద్మవిభూషణ్’ దక్కింది. దీనిపై చిరంజీవి స్పందించారు.

‘‘నా తల్లి కడుపున పుట్టకపోయినా మీ సొంత మనిషిలా.. మీ అన్నయ్యలా, మీ బిడ్డలా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండల వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను.. నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.. ప్రతిష్టాత్మకమైన అవార్డు ‘పద్మవిభూషణ్’కు తనను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు.’’అని చిరంజీవి పేర్కొన్నారు.

అదేవిధంగా 45 సంవత్సరాల తన సినీ ప్రస్థానంలో వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి తను శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నానని తెలిపారు. సమాజంలో అవసరమైనపుడు తనకు చేతనైనా సాయం చేస్తున్నానని చెప్పారు. ప్రజలు తనపై చూపే అభిమానంలో తాను చేసే సాయం గోరంతేనని తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు దేశ వ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు, ప్రజలు అభినందనలు చెబుతున్నారు.

You may also like

Leave a Comment