Telugu News » ISRO GLOBAL WARNING : కరుగుతున్న హిమాలయాలు.. ప్రపంచదేశాలకు ఇస్రో వార్నింగ్!

ISRO GLOBAL WARNING : కరుగుతున్న హిమాలయాలు.. ప్రపంచదేశాలకు ఇస్రో వార్నింగ్!

భారతదేశం-నేపాల్‌ సరిహద్దులను ఆనుకుని ఉన్న హిమాలయ పర్వతాలు (Mount Himalayas) వేగంగా కరిగిపోతున్నట్లు ఇస్రో (ISRO) పర్యావరణ సైంటిస్టులు ప్రపంచదేశాలకు హెచ్చరికలు పంపించారు. దీనంతటికి గ్లోబర్ వార్మింగ్ (Global Warming) కారణమని వారు అభిప్రాయానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో భూతాపం వేగంగా పెరిగి, శీతలమైన హిమాలయాలు కరుగడానికి కారణం అవుతున్నదని వారు తమ పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

by Sai
Melting Himalayas.. ISRO warning to the countries of the world!

హిమాలయాల్లోని మంచు పర్వతాలు రోజురోజుకూ కరగడం వలన సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ప్రకటించింది. 2016-17 సంవత్సరాల్లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 89శాతం పెద్ద ఎత్తున విస్తరించారని ఇస్రో నివేదికలో వెల్లడైంది.

వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపు అయ్యిందని ఇస్రో సైంటిస్టులు పేర్కొన్నారు. క్రమంగా భూమి వేడెక్కడం వలన భౌగోళికంగా మార్పులు సంభవించి హమానీనదాలు కరిగిపోతున్నాయని, ఇలా జరగడం వలన కొత్త సరస్సులు ఏర్పడటం, ఉన్న సరస్సులు మరింతగా విస్తరించి లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని ఇస్రో సైంటిస్టులు హెచ్చరించారు.

1984 నుంచి 2023 మధ్య 36.50 నుంచి 101.30 హెక్టార్లకు 178 శాతం పెరుగుదలను చూపిస్తోందని ఇస్రో నివేదిక పేర్కొంది. హిమానీ నదీ పరివాహక ప్రాంతాలను కవర్ చేసే దీర్షకాలిక ఉపచిత్రాలను విశ్లేషించిన ఇస్రో సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, ఆధునిక మానవుడు అభివృద్ధి పేరిట అద్భుతాలు సృష్టించడంతో పాటు చెట్లను నరికి, మైనింగ్ పేరిట పర్యావరణాన్ని నాశనం చేయడం వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి.

You may also like

Leave a Comment