Telugu News » BRS : నదుల అనుసంధానంపై ‘బండి’కి ఏం తెలుసు.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కీలకవ్యాఖ్యలు!

BRS : నదుల అనుసంధానంపై ‘బండి’కి ఏం తెలుసు.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కీలకవ్యాఖ్యలు!

బీఆర్ఎస్ కరీంనగర్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ (BRS MP CANDIDATE VINOD KUMAR) సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ సెక్రటరీ బండి సంజయ్‌ (MP BANDI SANJAY)పై ఘాటు విమర్శలు చేశారు.

by Sai
What does 'Bundi' know about the linking of rivers.. BRS MP candidate Vinod Kumar's key comments!

బీఆర్ఎస్ కరీంనగర్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ (BRS MP CANDIDATE VINOD KUMAR) సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ సెక్రటరీ బండి సంజయ్‌ (MP BANDI SANJAY)పై ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేంద్రంలోని బీజేపీ సరికొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. గంగ నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్యలో గల కావేరి నది వరకు నదుల అనుసంధానం ఎలా చేస్తారని ఆయన బండి సంజయ్‌ను, బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు.

What does 'Bundi' know about the linking of rivers.. BRS MP candidate Vinod Kumar's key comments!

మంగళవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ..‘తెలంగాణలో నీటి వాటా ఇంకా లేలనేలేదు. గోదావరి ‌నదిలో రాష్ట్ర వాటా చ ఏమిటి? ఇచ్చంపల్లి దగ్గర డ్యామ్ కడుతామంటే బీఆర్ఎస్ పార్టీ తప్పక అడ్డుకుంటుంది. 1985లో ఇచ్చంపల్లి ప్రాజెక్టు పై‌ ఎన్టీఆర్ హయాంలో సర్వే జరిగింది.ఆ ప్రాజెక్టును ఛత్తీస్‌గఢ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటివరకు గంగ నుంచి మహానదికే ఇంకా సర్వేను పూర్తిచేయలేదు. గోదావరి నీటిని కృష్ణాకి, కృష్ణా నుండి కావేరీకి ఎలా‌ తరలిస్తారు. తాజాగా కేంద్రం తెలంగాణకు డీపీఆర్ లేఖ పంపింది.

ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు గోదావరి నీరే దిక్కు..ఇప్పుడు ‌ఆ నీటినే తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇచ్చంపల్లి నుండి తమిళనాడుకి నీటిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి‌ బండి సంజయ్‌కి‌ ఇచ్చంపల్లిపై అవగాహన ఉందా?. బచావత్ ట్రిబ్యునల్ మిగులు జాలాలు అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే అని చెప్పింది. కేసీఆర్ దూరదృష్టి తోనే అదనపు టీఎంసీ కోసం వరుద కాలువ నిర్మాణం చేపట్టారు.

తెలంగాణకు దక్కే నీటి వాటా తేలే వరకు ఇంటర్ లింక్ రివర్‌లని వాయిదా వేయాలి. బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇచ్చంపల్లి నీటి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.సమ్మక్క,సారక్క ప్రాజెక్టు కొసం దరఖాస్తు చేసి రెండేళ్లు గడుస్తున్నా అనుమతులు ఇస్తలేరు.నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా ప్రాజెక్టు గురించి కేంద్రాన్ని ప్రశ్నించారా? కేసీఆర్‌ని‌ బద్నాం చేయడానికి మేడిగడ్డ డ్రామాలు‌ ఆడింది కాంగ్రెస్ పార్టీ.మేడిగడ్ఢ కుంగడంలో ఎవరిది తప్పని ఇప్పటికీ తేల్చలేదు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే కాపర్ డ్యాం‌ కట్టి నీటిని ఎత్తిపోసి నీటిని అందించేవారు.కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వలన నీరంతా కిందకు వదిలారు. ఇచ్చంపల్లి ‌ప్రాజెక్టు నిర్మాణంపై‌ బండి సంజయ్ స్పందించాలి.ఆయన మాకు దేవుళ్ళ గురించి చెప్పేవాడు అయ్యిండా? ధర్మం అని చెప్పే బండి సంజయ్ అయన ధర్మం నిర్వర్తించాలి. మా హయాంలో కట్టిన ప్రాజెక్టులకు అన్నీ‌ హిందు దేవుళ్ళ పేర్లే పెట్టాం. మీరు కొత్తగా మాకు హిందూ ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం లేదు’ అని వినోద్ కుమార్ స్పందించారు.

You may also like

Leave a Comment