Telugu News » Harish Rao : కరోనా వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎటు పోయారు…!

Harish Rao : కరోనా వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎటు పోయారు…!

కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy) మాత్రం కేవలం 3 గంటల కరెంట్ సరిపోతుందని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌తో పోలిస్తే తమ మెనిఫెస్టోనే చాలా నయమని అన్నారు.

by Ramu

కాంగ్రెస్ (Congress)​ నేతలను నమ్మితే మోసపోవడం ఖాయమని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తోందన్నారు. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy) మాత్రం కేవలం 3 గంటల కరెంట్ సరిపోతుందని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌తో పోలిస్తే తమ మెనిఫెస్టోనే చాలా నయమని అన్నారు.

minister harish rao fires on congress harish rao speech at husnabad road show

హుస్నాబాద్ నియోజక వర్గంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్​, టీడీపీ పాలనలో హుస్నాబాద్​ అభివృద్ధి చెందలేదన్నారు. కేవలం బీఆర్ఎస్ పాలనలోనే హుస్నాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. కరోనా వచ్చినప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్​ నేతలు ఎక్కడికి వెళ్లారంటూ మంత్రి ప్రశ్నించారు.

కోహెడ మండలంలో అన్ని గ్రామాలకు భవనాలు మంజూరు చేశామన్నారు. కేసీఆర్​ వచ్చాక ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు వచ్చాయని వెల్లడించారు. సర్పంచ్​లు, ఎంపీటీసీలకు నిధులు మంజూరు చేశామన్నారు. కేసీఆర్​ అంటే రాష్ట్ర ప్రజలకు చాలా నమ్మకమన్నారు. కేసీఆర్​ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నామని తెలిపారు.

తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత బీఆర్​ఎస్​దే అని.. గీత, నేత కార్మికులకు పింఛన్​ ఇస్తున్నామని చెప్పారు. రైతు బంధు పెట్టి దుబారా చేస్తున్నారని ఉత్తమ్ అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధు జీరో అవుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్​ గెలిస్తేనే రైతుబంధు డబ్బులు వస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు.

అధికారం కోసం కాంగ్రెస్​ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇవ్వబోతున్నామని ప్రకటించారు. బీఆర్​ఎస్​ గెలిచిన వెంటనే జనవరి నుంచి సన్న బియ్యం ఇస్తామన్నారు. హుస్నాబాద్​లో మూడు దిక్కులా అభివృద్ధి జరుగుతోందన్నారు. కోహెడలో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయించామన్నారు. హుస్నాబాద్​లో 100 పడకల గది నిర్మిస్తున్నామన్నారు.

 

You may also like

Leave a Comment