Telugu News » Harish Rao: రైతులపై కాంగ్రెస్ కు కనికరం లేదు….!

Harish Rao: రైతులపై కాంగ్రెస్ కు కనికరం లేదు….!

రైతులపై కాంగ్రెస్‌కు కనికరం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

by Ramu

కాంగ్రెస్‌ (Congress) పై మంత్రి హరీశ్ ​రావు (Harish Rao) మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల పట్ల కాంగ్రెస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్‌కు కనికరం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

\

రాష్ట్రంలో 69 లక్షల మందికి రైతు బంధు అందుతోందని వెల్లడించారు. రైతులకు సకాలంలో రైతుబంధు అంద కూడదని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే ప్రభుత్వ పథకాలను కూడా ఆపాలని అంటారేమో అని ఎద్దేవా చేశారు. రైతుల జోలికి వస్తే ఖబర్దార్​అంటూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ లాగా తాము ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చి ఆ తర్వాత విస్మరించబోమని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వక పోయినప్పటికీ రైతు బంధు పథకాన్ని అమలు చేశామని చెప్పారు. రైతు బంధు డబ్బులు ఎలా ఇస్తారని ఎన్నికల కమిషన్​కు కాంగ్రెస్ ఎలా ఫిర్యాదు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల డిపాజిట్లు రైతులు గల్లంతు చేస్తారన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేకి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రైతులు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంటు కూడా కాంగ్రెస్ సరిగా ఇవ్వడం లేదన్నారు. రైతులకు 3 గంటల కరెంటే చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు.

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. దేశంలో వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటి తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ఇదంతా బీఆర్ఎస్ సర్కార్ కృషి అని వెల్లడించారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చి.. రైతులను కేసీఆర్ ఆదుకున్నారన్నారు.

You may also like

Leave a Comment