Telugu News » KTR : డబ్బు కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి… త్వరలోనే జైల్లో చిప్పకూడు తింటాడు….!

KTR : డబ్బు కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి… త్వరలోనే జైల్లో చిప్పకూడు తింటాడు….!

కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టినందుకు కర్ణాటక ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

by Ramu
minister ktr fire on tpcc chief revanth Reddy

కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) వచ్చింది.. కరెంట్ పోయిందని మంత్రి కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టినందుకు కర్ణాటక ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో బీఆర్​ఎస్​ అభ్యర్థి పట్నం మహేందర్​రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… నరేందర్‌ రెడ్డిని గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా పట్నం నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇప్పిస్తానన్నారు.

మళ్లీ ఇప్పుడు ఓటమి ఎందుకులే అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నామినేషన్‌ వెనక్కి తీసుకుంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తింటారన్నారు. రాబోయే కాలంలో ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా? ప్రజలు తేల్చుకోవాలన్నారు.

ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండేండ్లలో కొడంగల్‌లోని 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. కొడంగల్‌ను ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన పెద్ద దొంగ రేవంత్‌ అంటూ నిప్పులు చెరిగారు.

కొడంగల్‌ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్‌ రెడ్డి డబ్బులను నమ్ముకున్నారని అన్నారు. లీడర్లను రేవంత్ రెడ్డి కొంటున్నారని ఆరోపణలు చేశారు. కానీ కొడంగల్‌ ప్రజలను మాత్రం రేవంత్‌రెడ్డి కొనలేరని పేర్కొన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు.

కాంగ్రెస్‌ నేతలు అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఇస్తే తీసుకోవాలన్నారు. ఎన్నికల రోజున మాత్రం కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను ఖతం చేసేందుకు డిల్లీ నుంచి దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ, రాహుల్‌ గాంధీ, ఖర్గే, కేంద్రమంత్రులు, సామంతులు దేశ రాజధాని నుంచి తెలంగాణకు వస్తున్నారని అన్నారు.

తెలంగాణ గొంతుకను పిసికేందుకు మూకుమ్మడిగా ఢిల్లీ నేతలు వస్తున్నారన్నారు. తెలంగాణ గొంతుకను కాపాడుకోవాలన్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్‌ కావాలా? అని ప్రశ్నించారు. రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? స్కీములు కావాలా? స్కాములు కావాలా? ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.

You may also like

Leave a Comment