మహిళల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తోందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ(ITC Kakatiya)లో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా ‘ఉమెన్ ఆస్క్ కేటీఆర్’ అనే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. శ్రీనిధి వంటి కార్యక్రమాలు మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నాయి. సంపద సృష్టించాలని మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. దీంతో చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించారు.’ అని కేటీఆర్ చెప్పారు.
మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం వి-హబ్‌లు ఏర్పాటు చేశామని అని చెప్పారు. ‘ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్ర. ఉమ్మడి కుటుంబంలోనే తన చిన్నతనం గడిచింది. నా జీవితంలో ఎంతోమంది స్ట్రాంగ్ ఉమెన్ లీడర్లను చూశాను. సానియా మీర్జా, సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది మహిళలు హైదరాబాద్ నుంచి క్రీడల్లో రాణిస్తున్నారు.’ అని కేటీఆర్ తెలిపారు.
మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించాం. ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు, గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామ్నారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశాం. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకుపైగా ఖర్చు చేస్తున్నాం. హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Live: Minister @KTRBRS at "Future Forward Telangana" event in Hyderabad #WomenAskKTR https://t.co/OHFLXIEjGs
— KTR News (@KTR_News) November 19, 2023