తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు కేటీఆర్‌ను కలిసి.. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించిన విషయం తెలిసిందే. యూఎస్ టూర్లో ఉన్న కేటీఆర్.. రాష్ట్ర రాజకీయాలపైనా ఓ కన్నేసి ఉంచారు.
తాజాగా ఆయన మరోసారి బీజేపీ(BJP) , కాంగ్రెస్ (Congress)పార్టీలపై మంత్రి ట్విటర్ (Twitter)వేదికగా విమర్శలు చేశారు.బీజేపీ రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత, ఇతర సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఉందంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
2013-14 లో విద్యుత్ లోటుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉందని అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
అందుకే తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశానికి ఉత్తమ అభివృద్ధి నమూనా అని కొనియాడారు. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ విధానాలను.. పథకాలను ఫాలో అవుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు