డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం(BR Ambedkar Secretariat)లో సోమవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేషీలోకి రాగానే వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
బాధ్యతల స్వీకరించిన అనంతరం ఆయన టీఎస్ఆర్టీసీ, రవాణా శాఖలకు సంబంధించిన మూడు ఫైళ్లపై సంతకం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి బస్‌పాస్‌లకు రాయితీల ఖర్చు రీయింబర్స్‌మెంట్ కోసం 212.50 కోట్లను విడుదల చేస్తూ ఒక ఫైలుపై సంతకం చేశారు.
మరో సంతకం 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి గానూ 162.50 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరొక ఫైల్‌పై సంతకం చేశారు. అదేవిధంగా ఎల్.రాజ్య లక్ష్మి, హెడ్ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‌కు ఒక రూ.లక్ష రూపాయలు మెడికల్ క్లెయిమ్ మంజూరు చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వివేక్, ఆది శ్రీనివాస్, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, వాణీప్రసాద్ తదితరులు అభినందించారు.