Telugu News » Minister Tummala : సంక్షేమ పథకాలు అమలుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి.. ఇప్పట్లో లేనట్టే..!?

Minister Tummala : సంక్షేమ పథకాలు అమలుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి.. ఇప్పట్లో లేనట్టే..!?

ఖమ్మం జిల్లా సర్వోతోముఖాభివృద్ధికి మీ భాగస్వామ్యం కావాలన్నా మంత్రి.. ఏనాడూ ఉద్యోగుల విషయాల్లో తల దూర్చలేదని క్లారిటీ ఇచ్చారు. గట్టిగా మందలించి అయినా సమన్వయం చేసి ప్రజల సేవలో భాగస్వామ్యం చేశాను తప్ప ఇబ్బంది పెట్టలేదని వివరించారు.

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల విషయంలో పలు సందేహాలు లేవనెత్తుతోన్న నేపథ్యంలో.. వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్.. బీజేపీ (BJP) నేతలు.. ఆరు గ్యారంటీలపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో సంక్షేమ పథకాల అమలు కొంత ఆలస్యం అవ్వొచ్చు కానీ, చేసి తీరుతామని తుమ్మల సృష్టం చేశారు..

ఖమ్మం ప్రజలు కోరుకున్నట్టే ఇక్కడ మార్పు జరిగిందని తెలిపిన తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao).. ప్రజలు అంతా కలిసి నిర్బంధ పాలన, అవినీతి పాలన, అశాంతి పాలన, నియంత పాలనను తరిమికొట్టారన్నారు. ఈ మార్పు మీకు మీరుగా తెచ్చుకున్న మార్పు అని వెల్లడించారు.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా.. ఖమ్మం (Khammam) ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ముందుకు సాగుతానని తెలిపారు..

ఖమ్మం జిల్లా సర్వోతోముఖాభివృద్ధికి మీ భాగస్వామ్యం కావాలన్నా మంత్రి.. ఏనాడూ ఉద్యోగుల విషయాల్లో తల దూర్చలేదని క్లారిటీ ఇచ్చారు. గట్టిగా మందలించి అయినా సమన్వయం చేసి ప్రజల సేవలో భాగస్వామ్యం చేశాను తప్ప ఇబ్బంది పెట్టలేదని వివరించారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంతలా ఆధ:పాతాళానికి వెళ్లిందో మీరే చూస్తున్నారని.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించకుంటే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతోందని తుమ్మల తెలిపారు..

దేశంలోనే అన్ని వనరులున్న రాష్ట్రం తెలంగాణ.. అలాంటి రాష్ట్రం, పాలనాపరమైన ఇబ్బందుల వల్ల గాడి తప్పిందని.. అయినా మంత్రులంతా కలిసి.. దుబారా ఖర్చులు మానేసి, ప్రజావసరాలు తీరేలా పరిపాలన కొనసాగిస్తామన్నారు.. అతికొద్ది రోజుల్లోనే మీరు శభాష్ అనేలా పాలన కొనసాగిస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.. ప్రజలు కోరుకొంటున్న న్యాయమైన డిమాండ్లను కేబినెట్ మంత్రులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment