Telugu News » Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది…..!

Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది…..!

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిపారు.

by Ramu
minister uttam kumar reddy review on sitarama project

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టులో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిపారు. స్వతంత్ర భారతంలో ఇంత పెద్ద తప్పిదం ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister uttam kumar reddy review on sitarama project

రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…. సీతారామ ప్రాజెక్ట్‌ ఖర్చు భారీగా పెంచారని తెలిపారు. 2014లో మరో 14 వందల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు అయిపోయేదన్నారు.కానీ పదేండ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పారు.

7,500 కోట్లు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. 3 లక్షలకు పైగా ఆయకట్టుకు అప్పుడే నీళ్ళు వచ్చేదన్నారు. .కానీ ఇప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుకు మొత్తం 18వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని వివరించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…..

సీతారామ ప్రాజెక్టు పేరు చెప్పి రూ.18 వేల కోట్లకు అంచనా వ్యయం పెంచారని వెల్లడించారు. కొత్త ఆయకట్టు కింద ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చు కుందే నీళ్ల కోసమన్నారు.. కానీ, గత బీఆర్ఎస్ సర్కార్ మాత్రం ప్రాజెక్టులను పూర్తి చేయకుండా అక్కరకు రాని కాళేశ్వరాన్ని కట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని నిప్పులు చెరిగారు.

You may also like

Leave a Comment