Telugu News » Suryavanshi Thakur: నెరవేరిన శపథం…. 500 ఏండ్ల తర్వాత తలపాగాలు ధరిస్తున్న ఆ వంశస్తులు….!

Suryavanshi Thakur: నెరవేరిన శపథం…. 500 ఏండ్ల తర్వాత తలపాగాలు ధరిస్తున్న ఆ వంశస్తులు….!

500 ఏండ్ల క్రితం అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చిన వేసిన సమయంలో సూర్య వంశి ఠాకూర్ వంశస్తులు తలపాగాలను తీసేశారు.

by Ramu
Suryavanshi Thakurs of UP finally don turbans after almost 500 years

యూపీ (UP)లోని సరైరాశి గ్రామానికి చెందిన సూర్య వంశి ఠాకూర్ వంశస్తులు ఐదువందల ఏండ్ల తర్వాత తలపాగాలు (Turbans) ధరించారు. 500 ఏండ్ల క్రితం అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చిన వేసిన సమయంలో సూర్య వంశి ఠాకూర్ వంశస్తులు తలపాగాలను తీసేశారు. ఆ సమయంలోనే ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశారు.

Suryavanshi Thakurs of UP finally don turbans after almost 500 years

కూల్చిన చోటనే రామ మందిరాన్ని తిరిగి నిర్మించే వరకు తమ వంశస్తులెవరూ తలపాగా ధరించబోరని శపథం చేశారు. అప్పటి నుంచి ఆ వంశస్తులు తలపాగా ధరించ లేదు. ఆ తర్వాత 2019 లో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ కావడంతో సూర్య ఠాకూర్ వంశస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

అప్పటి నుంచి రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఆ వంశస్తులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. 500 ఏండ్లుగా ఎదురు చూస్తున్న శుభ సమయం రానే వచ్చింది. ఈ నెల 22న రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు పూర్తవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సూర్య వంశి ఠాకూర్ వంశస్తులు తమ తలపాగాలను ధరించారు. ప్రారంభోత్సవాని కన్నా ముందే తలపాగాలు ధరించాలని నిర్ణయించుకున్నట్లు సూర్యవంశి ఠాకూర్‌లు తెలిపారు. వారు తలపాగాలు ధరించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment