ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఒకరు చొక్కా మడత పెడితే అని అంటే… .మరొకరు కుర్చీ మడత పెడతాం అంటూ డైలాగ్‌లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యాఖ్యలకు మంత్రులు అంబటి రాంబాబు (Ambati Rambabu), అమర్ నాథ్ (Gudivada Amarnath) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నారా లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంత్రి అంబటి రాంబాంబు ట్వీట్ చేశారు. కుర్చీ సంగతి తర్వాత ముందు నాలుక మడతపడకుండా చూసుకో అంటూ సెటైర్లు వేశారు. బాబు లోకేశ్ ఇక్కడ ఉన్నది సింహాసనం… కుర్చీ కాదు మడతపెట్టాడానికి అంటూ వరుస ట్వీట్లలో ఎద్దేవా చేశారు.
మరోవైపు నారా లోకేశ్‌కు మంత్రి అమర్ నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేశ్‌కు నాలుక మడత పడిందని అన్నారు. ముందు దాన్ని సరిచేసుకోవాలని సెటైర్లు వేశారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ దెబ్బకు చంద్రబాబు కుర్చీ మడత పడిందని ఎద్దేవా చేశారు.
రాబోయే ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని వెల్లడించారు. 60 రోజుల్లో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేసేందుకు రాష్ట్ర ప్రజలు ముఖ్య భూమికి పోషించనున్నారని తెలిపారు. చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి కుర్చీ లాక్కునే టైపు సీఎం జగన్ కాదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము జగన్ వద్ద పని చేసే సైనికులమని తెలిపారు.