71వ ప్రపంచ సుందరి పేరు వెల్లడైంది. ముంబై(mumbai)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీలు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ అందాల పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిజ్కోవా((Krystyna Pyszkova) గెలుపొందగా, లెబనాన్‌కు చెందిన యాస్మినా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
ఈ ఏడాది 120 మంది ఈ అందాల భామలు పోటీలో పాల్గొన్నారు. అందరినీ వెనక్కి నెట్టి క్రిస్టినా పిజ్కోవా టైటిల్‌ను గెలుచుకుంది. చివరిసారి ఈ పోటీలో పోలాండ్ నివాసి కరోలినా బిలావ్స్కా గెలిచారు. క్రిస్టినా పిజ్కోవాకు పట్టాభిషేకం చేసింది ఆమె. ఈ పోటీలో భారత్ తరఫున తరపున సినీశెట్టి పాల్గొన్నారు. కానీ ఆమె ఈ టైటిల్‌ను గెలవలేకపోయింది.
సినీశెట్టి ఆమె టాప్-8కి చేరుకోవడంలో విజయం సాధించింది. కానీ టాప్ 4 కంటెస్టెంట్స్ ఎంపికైనప్పుడు, ఆమె అందులో చేరలేకపోయింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునే రేసు నుంచి నిష్క్రమించింది. సినీశెట్టి స్వస్థలం కర్ణాటక. ముంబైలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. ఆమె 2022లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.
ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున పోటీల్లో పాల్గొంది. అయితే ఈసారి ఆమెకు టైటిల్ గెలుస్తుందని చాలా మంది అనుకున్నా చివరికి నిరాశే ఎదురైంది. 28 ఏళ్ల తర్వాత భారత్‌లో మిస్ వరల్డ్ నిర్వహించారు. అంతకుముందు 1996 సంవత్సరంలో 46వ ఎడిషన్ భారతదేశంలో నిర్వహించబడింది. ఈసారి ముంబై నగరం అందుకు వేదిక కాగా, 28 ఏళ్ల కిందట బెంగళూరులో జరిగింది.