బీఆర్ఎస్(BRS) ఎన్నికలొస్తే చాలు.. సెంటిమెంట్ రగిల్చి రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Aleru MLA Beerla Ailaiah) విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్(Congress Government)పై ప్రభుత్వంపై బీఆర్ఎస్(Brs) లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు.
పది సంవత్సరాలు ఏమీ చేయని వారు.. ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పుడు ప్రజలను సెంటిమెంట్‌తో రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండ రైతులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పి ఈ గడ్డమీద అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలకు తమకేం అభ్యంతరం లేదన్నారు.
జగన్‌తో లోపాయికార ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ ఏపీకి నీటిని అప్పగించారని ఆరోపించారు. తన ఫామ్ హౌస్‌కు నీళ్లు తెచ్చుకున్న కేసీఆర్ చుట్టుపక్కల మండలాలకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికే పోయాయన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఎన్నికలప్పుడు ప్రజలను రెచ్చగొట్టడం అలవాటేనని విమర్శించారు. ఓట్లకోసం నాటకాలు సాగవని, బీఆర్ఎస్ పిట్ట బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇస్తామని, బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.