Telugu News » MLC Jeevan Reddy: మిషన్ భగీరథ అక్రమాలపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

MLC Jeevan Reddy: మిషన్ భగీరథ అక్రమాలపై విచారణ జరపాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించారు. అనంతరం ఆయన గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

by Mano
MLC Jeevan Reddy: Mission Bhagiratha irregularities should be investigated: MLC Jeevan Reddy

మిషన్ భగీరథ అక్రమాలపై విచారణ జరపాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC) జీవన్‌రెడ్డి(Jeevan Reddy) డిమాండ్ చేశారు. ఇవాళ శాసనమండలిలో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించారు. అనంతరం ఆయన గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

MLC Jeevan Reddy: Mission Bhagiratha irregularities should be investigated: MLC Jeevan Reddy

సాగు నీరు హక్కులు కాపాడటంలో మాజీ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని చెప్పి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సాగునీటి వినియోగంపై దృష్టి పెట్టకుండా, పర్యాటకంపై దృష్టి పెట్టిందంటూ ఆరోపించారు.

అదేవిధంగా విద్యుత్ విభాగంలో రూ.80వేల కోట్ల అప్పులు ఉన్నాయని జీవన్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం, మిషన్ భగీరథపై విచారణ జరిపించాల్సిందేనని పట్టుబట్టారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం అంటోందని ఆయన తెలిపారు. అన్ని వసతులు ఉన్నా, రామగుండం కాదని యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టారని విమర్శించారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలన్న ఆయన, ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని, కేంద్రం వివక్ష వల్ల జాతీయ హోదా సాధించలేకపోయామని జీవన్‌రెడ్డి అన్నారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకోవాలని, ఉదాసీనత తగదని హితవు పలికారు.

You may also like

Leave a Comment