తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Government) ఇటీవల జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్లో అణగారిన వర్గాల ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆరోపించారు.
బుధవారం ఆమె తన ఎక్స్ (X) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. పలు ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీశారు. గ్రూప్-1 నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లుగా ఉందన్నారు.
ఈ పద్ధతి వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదముందని కవిత పేర్కొన్నారు. అసలు రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలరా..? అని ఆమె ప్రశ్నించారు. 563 గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసి మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలన్నారు. రోస్టర్ పాయింట్లను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోంది. ఇటీవల జారీ చేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉంది. దీని వల్ల బిసి, ఎస్సీ, ఎస్టి మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
రోస్టర్… pic.twitter.com/D93HazdFrj
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 21, 2024