Telugu News » Mlc Kavitha: గిరిజనులపై కేంద్రానిది కక్ష!

Mlc Kavitha: గిరిజనులపై కేంద్రానిది కక్ష!

గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.

by admin
mlc kavitha

మణిపూర్ అల్లర్ల(Manipur Clashes) వ్యవహారం జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగడం లేదు. మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు విపక్షాలు (Oposition) పట్టుబడుతున్నాయి. బీజేపీ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ (Brs Party) సైతం వీలుచిక్కినప్పుడల్లా కేంద్రాన్ని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో మాట్లాడిన ఆమె.. గిరిజనుల(tribles) పై కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

mlc kavitha

గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. మణిపూర్‌ లో ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని.. రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందన్న కవిత.. విభజించు పాలించు రీతిలో ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. బ్రిటీషర్లు మెదలు పెట్టింది‌‌.. బీజేపీ ఫాలో అవుతోందని విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 9 శాతానికి పెంచుకున్నామని.. గిరిజనులకు 4 లక్షల 5 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. దీనిద్వారా 1 లక్షా 57 మంది గిరిజన కుటుంబాలకు పోడు భూములపై హక్కులు లభించాయని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం అని, నిర్వహణకు ప్రభుత్వం రూ.340 కోట్లు ఖర్చుచేసిందని వివరించారు. గిరిజనులకు రూ.1,336 కోట్ల కళ్యాణ లక్ష్మీ నిధులు ఖర్చు చేశామని తెలిపారు. ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకే ఖర్చు చేయటానికి 2017లో కేసీఆర్ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారన్నారు.

ఆదివాసీ భవన్‌ తో పాటు.. కొమురం భీం పేరుతో జోడే ఘాట్‌ ను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు కవిత. రూ.22 కోట్లతో హైదరాబాద్‌ లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించామన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నా.. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేంద్రం ఇవ్వటం లేదని ఆరోపించారు కవిత.

You may also like

Leave a Comment