Telugu News » Samantha : ఆగుతారా 2నిమిషాలు.!.నేను ఏ హీరోని డబ్బులడగలేదు..!!

Samantha : ఆగుతారా 2నిమిషాలు.!.నేను ఏ హీరోని డబ్బులడగలేదు..!!

సమంత..సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్.రీర్ తొలినాళ్లో ఉన్న హెవీ కాంపిటీషన్ తట్టుకుని..తన వైవిధ్యమైన నటనతో దక్షిణాది భాషల్లో ముఖ్యంగా తెలుగు,తమిళ్ లో సూపర్బ్ క్రేజ్ సంపాదించుకున్నారు

by sai krishna

సమంత..సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్.కెరీర్ తొలినాళ్లో ఉన్న హెవీ కాంపిటీషన్ తట్టుకుని..తన వైవిధ్యమైన నటనతో దక్షిణాది భాషల్లో ముఖ్యంగా తెలుగు,తమిళ్ లో సూపర్బ్ క్రేజ్ సంపాదించుకున్నారు.వచ్చిన రెమ్యుని రేషన్ లో ఎంతోకొంత చారిటీలకు కూడా ఖర్చుచేస్తూ వచ్చారు.

అయితే సమంతకు ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే..! ఈ వ్యాధి ట్రీట్ మెంట్ నిమిత్తం ప్రస్తుతం ఆమె సినిమాలకు కూడా తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది.

 

ట్రీట్ మెంట్ ఖర్చుకూడా భారీగానే అవుతోందట.ఈ నిమిత్తం ఆమె ఓ స్టార్ హీరో దగ్గర అప్పు తీసుకున్నానంటూ వచ్చిన వార్తలను సమంత ఖండించారు. ఇన్స్టా వేదికగా ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

” మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దీనికి  నేను పెట్టిన ఖర్చు..కొంచెం మాత్రమే. నా కెరీర్లో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు.

నేను నా జాగ్రత్తలు చూసుకోగలను. మయోసైటిస్ అనేది ఓ సమస్య. వేలాది మంది దీనితో బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలి”అని సమంత పేర్కొన్నారు.

కాగా గత కొంత కాలంగా మయోసైటిస్తో బాధపడుతున్న సమంత.. ఈ విషయం గురించి కొద్ది రోజుల వరకు ఎక్కడా ప్రస్తావించలేదు. ఓ వైపు చికిత్స్ తీసుకుంటూనే మరోవైవు సినిమాలు చేస్తూ వచ్చారు.

యశోద సినిమా రిలీజ్ సమయంలో తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి అందరిని షాక్కు గురి చేశారు. అప్పుడు తన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆమెకు సపోర్ట్ ఇచ్చారు.

ఇంకొద్ది రోజుల తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ ‘శాకుంతలం’, ‘ఖుషి’ లాంటి సినిమాల్లో నటించారు. హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిశారు.

మరోవైపు విరామం ప్రకటించిన సమంత తొలుత ‘ఇషా ఫౌండేషన్’లో ధ్యానం చేస్తూ కనిపించారు.ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి బాలీ పర్యటనకు వెళ్లారు. తన ఫ్యాన్స్ కోసం వెకేషన్ ఫొటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేశారు.

బాలీ అందాల్లో తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన సామ్.. అక్కడ కొన్ని సాహాసాలు కూడా చేశారు. మైనస్ నాలుగు డిగ్రీల వద్ద ఆరు నిమిషాల పాటు గడ్డకట్టే చలిలో కూర్చుని ఐస్ బాత్ కూడా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

 

You may also like

Leave a Comment