పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తుండటంతో మరోసారి తెలంగాణ (Telangana) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.. కాంగ్రెస్ నేతలు సైతం ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి సైతం తన పాలనలో ప్రత్యేక మార్క్ కనపడేలా కీలక నిర్ణయాలు తీసుకొంటూ ముందుకు వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర గీతం విషయంలో సీఎం తీసుకొన్న నిర్ణయంపై బీఆర్ఎస్ (BRS)ఎమ్మెల్సీ కవిత ఫైర్ (MLC Kavitha) అయ్యారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఆయన ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదని ఆరోపించారు. మరోవైపు నాలాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని అంటున్న సీఎం.. తానూ తెలంగాణ ఆడబిడ్డనన్న విషయాన్ని మరచినట్లు ఉన్నారని గుర్తు చేశారు.
తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ మాట్లాడటం ఏంటీ? అని ప్రశ్నించిన కవిత.. టీఎస్పీఎస్సీ (TSPSC) చైర్మన్ మహేందర్ రెడ్డి (Chairman Mahender Reddy)ని తొలగించాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను ఆ పదవిలో కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని ఆరోపయించిన కవిత.. విద్యుత్ సంస్థల్లో ఏపీ వాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు నియమించారని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీకి ఏపీ సలహాదారుడు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ.. పాలన చేస్తుందని మండిపడ్డారు..