Telugu News » Modi Tour In Telangana: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

Modi Tour In Telangana: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

ఇవాళ ప్రధాని మోడీ(PM Modi) తెలంగాణ పర్యటనకు రానున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు.

by Mano
Modi Tour In Telangana: Prime Minister Modi's visit to Telangana.. The schedule is this!

తెలంగాణలో ఎన్నికల(Telangana Elections) ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. నవంబర్ 30న పోలింగ్ ఉండగా అన్ని పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీ(PM Modi) తెలంగాణ పర్యటనకు రానున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు.

Modi Tour In Telangana: Prime Minister Modi's visit to Telangana.. The schedule is this!

రేపు తుఫ్రాన్, నిర్మల్ బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారు. సోమవారం మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్‌తో పాటు హైదరాబాద్‌లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు. ప్రధాని మోడీ ఇవాళ మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కామారెడ్డిలో మ.2.05 గంటలకు, రంగారెడ్డి జిల్లాల్లో 4:55 గంటలకు నిర్వహించే బహిరంగ సభల్లో మోడీ  ప్రసంగిస్తారు.

నేటి రాత్రికి రాజ్ భవన్‌లో ప్రధాని బస చేస్తారు. రేపు(ఆదివారం) దుబ్బాక, నిర్మల్ బహిరంగసభల్లో మోడీ ప్రసంగం ఉంటుంది. ఉదయం 11:30గంటలకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమం, మధ్యాహ్నం 2గంటలకు దుబ్బాకలో నిర్వహించే బహిరంగసభల్లో మోడీ పాల్గొంటారు. అనంతరం నిర్మల్‌లో నిర్వహించనున్న బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారు.

నిర్మల్ నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి వెళ్తారు. తిరిగి సోమవారం మహబూబాబాద్, కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగసభల్లో మోడీ ప్రసంగాలు ఉంటాయి. పబ్లిక్ మీటింగ్‌తో పాటు హైదరాబాద్‌లో విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోడీ తిరుగు పయనమవుతారు.

You may also like

Leave a Comment