Telugu News » Mp Arvind: రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు..!

Mp Arvind: రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ గెలిస్తే టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయని అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పీఎఫ్ఐకి, లవ్ జిహాద్‌కు అడ్డాగా మారుతుందని హెచ్చరించారు. గల్ఫ్ కార్మికుల కష్టాలకు కారణం కాంగ్రెస్సేనన్నారు.

by Mano
CM Revanth Reddy should be careful from now on.. MP Arvind's key suggestion!

బీజేపీ ఎంపీ(BJP MP) ధర్మపురి ‌అర్వింద్(Dharmapuri Arvind) సంచల‌న‌ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో ఇవాళ(సోమవారం) ఏర్పాటు చేసిన బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో అర్వింద్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీజేపీ(BJP)లో చేరటం ఖాయమన్నారు.

MP Arvind: Revanth Reddy is certain to join BJP.. MP Arvind sensational comments..!

బీజేపీని తట్టుకోవటం కాంగ్రెస్‌(Congress)తో అయ్యే పని కాదని చెప్పుకొచ్చారు. ఏబీవీపీ నుంచి రేవంత్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతారంటూ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై అర్వింద్ ఇదివరకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని అన్నారు.

కాంగ్రెస్ గెలిస్తే టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయని అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల పీఎఫ్ఐకి, లవ్ జిహాద్‌కు అడ్డాగా మారుతుందని హెచ్చరించారు. గల్ఫ్ కార్మికుల కష్టాలకు కారణం కాంగ్రెస్సేనన్నారు. కాంగ్రెస్ గెలిస్తే హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్తారని అన్నారు. అదేవిధంగా 40 ఏళ్లుగా జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. తాను పసుపు బోర్డును తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు.

45ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఎన్నారైల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. కనీసం పది వేల మంది ఎన్నారైల‌ు వాపస్ తీసుకురాకుంటే తన పేరు మార్చుకుంటానని అర్వింద్ సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా కేసీఆర్ మాత్రమే కంట్రోల్ చేయగలిగాడని విమర్శించారు. ప్రస్తుతం బీజేపీని అడ్డుకోవటం కాంగ్రెస్ వల్ల కావటం లేదని ఎంపీ అర్వింద్ అన్నారు.

You may also like

Leave a Comment