తెలంగాణ (Telanagan)లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS)మధ్య మాటల యుద్ధం నిర్విరామంగా కొనసాగుతోంది. అసలే అసెంబ్లీ ఎన్నికలు ((Assembly Elections))దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో విమర్శలు గుప్పించకుంటే ఓటర్ల దృష్టిని ఆకర్షించడం కష్టం అనే భావనతో.. నేతలు దూకుడు పెంచారని కొందరు అనుకొంటున్నారు.
ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీ కాంగ్రెస్ కీలక నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy).. కేసీఆర్ (KCR) కేటీఆర్ (KTR)పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. అహంకారం అందలం ఎక్కితే బీఆర్ఎస్ నేతల్లాగా ఉంటుందని అన్నారు. కారు కావాలా.. బేకారు కావాలా అని మంత్రి కేటీఆర్ మాటలు అహంకారానికి నిదర్శమని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్, మంత్రి కేటీఆర్ హిట్లర్ తాతయ్యలని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ గెలుపును అపాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టో చూసి మైండ్ బ్లాక్ అయ్యిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.