Telugu News » MP Laxman : బీసీలపై రాహుల్ గాంధీ-కేటీఆర్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు..!?

MP Laxman : బీసీలపై రాహుల్ గాంధీ-కేటీఆర్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు..!?

రాష్ట్రంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా అభివృద్ధి చేసి చూపుతామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. బీసీలను అవమానించే విధంగా ఉన్న కేటీఆర్ (KTR) మాటలు చూస్తుంటే.. వారికి బీసీ (BC)లపై చిత్త శుద్ధి లేదన్న విషయం అర్థం అవుతుందని లక్ష్మణ్ మండిపడ్డారు.

by Venu
MP Laxman

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman).. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్‌(Congress)పై పలు విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు తోడు దొంగలని ఎంఐఎం (MIM) కబంధ హస్తాల్లో ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన లక్ష్మణ్.. తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించకున్న రాష్ట్రం కోసం కేంద్రం అభివృద్ది కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల తర్వాత కలుస్తాయన్న ఎంపీ.. బీజేపీ, బీసీని సీఎం చేస్తామంటే.. రాహుల్ గాంధీ విరుద్ధంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

MP Laxman

రాష్ట్రంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా అభివృద్ధి చేసి చూపుతామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. బీసీలను అవమానించే విధంగా ఉన్న కేటీఆర్ (KTR) మాటలు చూస్తుంటే.. వారికి బీసీ (BC)లపై చిత్త శుద్ధి లేదన్న విషయం అర్థం అవుతుందని లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ ఎప్పుడు బీసీ జనగణనకు వ్యతిరేకం కాదని.. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని లక్ష్మణ్ తెలిపారు.

కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల బీసీ జనగణన ఆలస్యం అవుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. రెడ్డి, చౌదరీలు కర్ణాటకలో బీసీలు, వైశ్యులు, బ్రాహ్మణులు ఇలా అందరూ అన్ని చోట్ల ఉన్నారన్న లక్ష్మణ్.. వారందరినీ బీసీలో చేర్చాలా? అని ప్రశ్నించారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో కృషి చేస్తామని లక్ష్మణ్ అన్నారు..

బీసీ సీఎం అభ్యర్థులు మా పార్టీలో చాలా మంది ఉన్నారన్న లక్ష్మణ్.. బీజేపీ (BJP) ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి పొత్తు లేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తుందని వెల్లడించారు. గ్యారంటీల పేరుతో కర్ణాటక ప్రజలని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించిన లక్ష్మణ్.. ఓట్ల కోసం గ్యారంటీలు అనే గాలం ఆ పార్టీ వేసిందని విమర్శించారు.. పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ పాలిత రాష్ట్రాలలో తక్కువ ఉన్నాయన్న లక్ష్మణ్.. ఇక్కడ కూడా అధికారం ఇస్తే తగ్గిస్తామని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment