Telugu News » Mudragada: నేను రాజకీయాల్లో హీరోని: ముద్రగడ పద్మనాభం

Mudragada: నేను రాజకీయాల్లో హీరోని: ముద్రగడ పద్మనాభం

తాను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడానికి తాను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని, అది తన ఇష్టమంటూ వ్యాఖ్యానించారు.

by Mano
Mudragada: I am a hero in politics: Mudragada Padmanabham

‘పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు.. అయితే ఎవరికి గొప్ప.. నేను రాజకీయాల్లో హీరోని..’ అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అన్నారు. సీఎం జగన్(CM Jagan) సమక్షంలో వైసీపీ(YCP)లో చేరిన విషయం తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల పట్ల స్పందించారు.

Mudragada: I am a hero in politics: Mudragada Padmanabham

తనను ఉద్దేశించి రకరకాల పోస్టులు పెడుతుండడం బాధాకరమన్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడానికి తాను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరంలేదని, అది తన ఇష్టమంటూ వ్యాఖ్యానించారు. మొలతాడు లేనోడు, లాగు లేనోడు తనకు రాజకీయ పాఠాలు చెబుతున్నారంటూ విమర్శించారు.

తాను ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజల భిక్షతో రాజకీయాల్లోకి వచ్చానని, వారి భిక్షతోనే ఎదిగానని.. ఎన్నో ఉద్యమాలు చేశానంటే అది వారి భిక్ష వల్లే అంటూ చెప్పుకొచ్చారు. కాపుల కోసం, దళితుల కోసం ఉద్యమాలు చేశానని తెలిపారు. ‘నా వర్గాన్ని, నా మనుషులను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను. అక్కడ కులం కాదు, నా వర్గం ముఖ్యం. నాపై రకరకాల పోస్టులు తెలిసీ తెలియక పెడుతున్నారు. అని అన్నారు. సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉందని తెలిపారు.

మిథున్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీత, కన్నబాబు వంటి పెద్దలను తనను పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించారు. అందుకే సంతోషంగా అంగీకరించి వైసీపీలో చేరానని తెలిపారు. అయినప్పటికీ తమ నాయకుడి వద్దకు ఎందుకు రాలేదంటూ పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ‘‘పవన్‌ సినిమా రంగంలో గొప్పవాడు కావచ్చు.. అయితే ఏంటి గొప్ప.. నేను రాజకీయాల్లో గొప్పవాడిని..’’ అంటూ ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు.

You may also like

Leave a Comment