Telugu News » Mudragada : చంద్రబాబు ఎస్టేట్ కి పవన్ కళ్యాణ్ జనరల్ మేనేజర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..!

Mudragada : చంద్రబాబు ఎస్టేట్ కి పవన్ కళ్యాణ్ జనరల్ మేనేజర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత..!

చుట్టూ 50మంది బౌన్సర్ లను పెట్టుకుని ప్రజలకు ఏమి సేవ చేస్తారని ముద్రగడ ప్రశ్నించారు.. పేదల పక్షాన నిలిచిన జగన్ ప్రభుత్వానికి అండగా ఉంటానని తెలిపారు.

by Venu
Mudragada Padmanabham: Kapu movement leader Mudragada joins YCP..!

ఏపీ (AP)లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విమర్శలను అస్త్రాలుగా మలచుకొని ప్రయోగిస్తున్నారు.. ఎన్ని మాట్లాడిన.. ఏం చేసిన గెలుపే లక్ష్యంగా.. అధికారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఈ నేపధ్యంలో జనసేన (Janasena)అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై వైసీపీ (YCP) నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కీలక వ్యాఖ్యలు చేశారు..

Mudragada: I am a hero in politics: Mudragada Padmanabhamచంద్రబాబు ఎస్టేట్ కి పవన్ కళ్యాణ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు.. సీట్లు త్యాగం చేసి, త్యాగ పునీతుడుగా కొనసాగడంతో త్యాగశీలి అనిపించుకొరని విమర్శించారు.. క్లబ్లు నడిపే వారిచే నన్ను తిట్టుస్తున్నాడని ఆరోపించారు.. చుట్టూ 50మంది బౌన్సర్ లను పెట్టుకుని ప్రజలకు ఏమి సేవ చేస్తారని ముద్రగడ ప్రశ్నించారు.. పేదల పక్షాన నిలిచిన జగన్ ప్రభుత్వానికి అండగా ఉంటానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ 23సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అవుతారో అర్థం కావడం లేదన్న ముద్రగడ.. పిఠాపురం ప్రజలను డబ్బులకు అమ్ముడు పోయే వారిగా చిత్రికరిస్తున్నారని ఆరోపించారు.. అదేవిధంగా కాపు రిజర్వేషన్ కేంద్రం పరిధిలో ఉందని జగన్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేసిన ఆయన.. నేను పవన్ కళ్యాణ్ కు రెండు లేఖలు వ్రాసిన సమాధానం లేదని పేర్కొన్నారు.. నన్ను తిట్టాలంటే ప్రెస్ మీట్ పెట్టి తిట్టే దైర్యం ఉందా అని సవాల్ విసిరారు..

పవన్ కళ్యాణ్ 5రూపాయలు,10రూపాయలు నాకు మనియార్డ్ చేయించారని తెలిపిన ముద్రగడ.. ఒక లక్షో, రెండు లక్షలో మనియార్డర్ చేస్తే ఆర్ధికంగా సహకరించిన వారు అవుతారని ఎద్దేవా చేశారు.. నాకు ఏ పదవి మీద ఆశ లేదని తెలిపిన ఆయన.. ప్రభుత్వం వచ్చాక జగన్ ఏమి ఇచ్చిన తీసుకుంటా, నాంతటా నేను ఏమి అడగను అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ ను ప్యాక్ చేసి ప్రజలు ఇంటికి పంపడం ఖాయని జోస్యం చెప్పారు. స్వచ్ఛమైన లిక్కర్ ఇస్తాను అంటూ రాజకీయాలలో కొత్తవొరవడి తీసుకువచ్చారని విమర్శించారు..

You may also like

Leave a Comment