రంజీత్ శ్రీనివాస్ మర్డర్ కేసులో కేరళ (Kerala), మావెలిక్కర (Mavelikkara) అదనపు జిల్లా సెషన్స్ కోర్టు (Court) సంచలన తీర్పు ఇచ్చింది. 2021 డిసెంబర్ లో బీజేపీ (BJP) నేత, న్యాయవాది రంజీత్ శ్రీనివాసన్ (Ranjith Srinivasan) హత్య కేసులో దోషులుగా తేలిన 15 మందికి మరణశిక్ష విధించింది. ఈ కేసులో ఎస్డీపీఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉన్న నిందితులను దోషులుగా పేర్కొంటూ జనవరి 20న తీర్పు వెలువరించింది.
ప్రధానంగా ఎనిమిది మంది నిందితులు ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలిన వారు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. మరోవైపు 2021 డిసెంబర్ 19న ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా నేత రంజిత్ శ్రీనివాసన్ ను ఆయన ఇంట్లోనే దారుణంగా నరికి చంపారు. ఎస్డీపీఐ కార్యకర్త కేఎస్ షాన్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన కుటుంబ సభ్యుల ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఈ హింసాత్మక ఘటన ఆ సమయంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. అయితే ఎనిమిది సంవత్సరాల తర్వాత జడ్జి శ్రీదేవి వీజీ, ఈ కేసులో తీర్పును వెలువరించారు. నిందితులకు అలపుజా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెంటల్ స్టెబులిటీ పరీక్షలు నిర్వమించాలని కోర్టు ఆదేశించింది. ఈ మర్డర్ కేసులో తొలి 8 నిందితులపై ఐపీసీలోని 302, 149, 449, 506, 341 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.
వీరికి జీవిత కాల శిక్షతో పాటు మరణదండన విధించారు. అయితే తొలి 8 మంది ప్రత్యక్షంగా మర్డర్లో పాలు పంచుకున్నారు. హత్యకు గురైన బీజేపీ నేత ఇంటి ముందు ఆయుధాలతో నిఘా పెట్టిన 9 నుంచి 12వ నిందితుడి వరకు వివిధ సెక్షన్ల కింద కేసులను బుక్ చేశారు. తాజాగా మొత్తం 15 మంది నిందితులకు మరణ శిక్ష ఖరారు చేశారు.