Telugu News » Nagababu: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు.. కారణమదే: నటుడు నాగబాబు

Nagababu: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు.. కారణమదే: నటుడు నాగబాబు

ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందన్న ఆయన ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) ఓటు వేయలేదన్నారు.

by Mano
Nagababu: Did not vote in Telangana elections.. Reason: Actor Nagababu

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీ(AP)లో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబు(Nagababu)పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. అంతేగాక ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందన్న ఆయన ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) ఓటు వేయలేదన్నారు.

Nagababu: Did not vote in Telangana elections.. Reason: Actor Nagababu

అధికార పార్టీకి చెందిన కొందరు దీనిని వివాదం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న నా ఓటును రద్దు చేసుకున్నానని తెలిపిన నాగబాబు.. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తన ఓటును ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకొని జనసేన.. టీడీపీకి మద్దతుగా నిలుస్తామన్నారు. తాను నెల్లూరునే చదువుకున్నానన్న నాగబాబు.. జనసేన ఆవిర్భావం తర్వాత పలుమార్లు నెల్లూరుకు వచ్చానన్నారు.

తన భార్య పిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలని అనుకున్నామని నాగబాబు తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులు అందజేశామన్నారు. అది పరిశీలనలో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. ఏ నియోజకవర్గమనేది తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నానని నాగబాబు స్పష్టం చేశారు.

రాజకీయ పదవుల మీద ఆసక్తి, కోరిక, ఆలోచన తనకు లేవని నాగబాబు స్పష్టం చేశారు. కేవలం జనసేన కార్యకర్తలలో స్ఫూర్తిని నింపేందుకే పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సోమిరెడ్డికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు సంబంధించి ఒక కామెడీ మ్యాగజైన్ ఉందని.. అందులో తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాశారని.. అందుకే ఓటును మార్చుకుందామని భావించానన్నారు. తన అమ్మమ్మ ఊరు అయిన నెల్లూరుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన తెలిపారు.

You may also like

Leave a Comment