Telugu News » Nagar Kurnool : బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ నేతల మధ్య ఘర్షణ.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

Nagar Kurnool : బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ నేతల మధ్య ఘర్షణ.. మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

మర్రి జనార్ధన్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారి డీఈఓ మీద దాడికి యత్నించారు. అయితే ఇందులో తన తప్పేం లేదంటూ డీఈవో బతిమాలుకోవడంతో పోలీసులు ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారు.

by Venu
brs congress

నాగర్ కర్నూల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (MLA Kuchukulla Rajesh Reddy) మాజీ ఎమ్మెల్యేతో పాఠశాల ప్రారంభించడానికి ఎలా అనుమతిస్తారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..

congress-leaders-are-criticizing-brs-leaders

దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకొంది. మర్రి జనార్ధన్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారి డీఈఓ మీద దాడికి యత్నించారు. అయితే ఇందులో తన తప్పేం లేదంటూ డీఈవో బతిమాలుకోవడంతో పోలీసులు ఆయనకు ప్రొటెక్షన్ ఇచ్చి పంపించారు. ఇదిలా ఉండగా పాఠశాల ప్రారంభోత్సవం కోసం ఎమ్మెల్యే పేరిట ఒకటి, మర్రి జనార్ధన్ రెడ్డి పేరిట రెండు శిలాఫలకాలు ఏర్పాటు చేయగా.. ఒక శిలాఫలకాన్ని రాజేష్ రెడ్డి అనుచరులు విరగ్గొట్టినట్లు తెలుస్తోంది.

దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే..మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ( Marri Janardhan Reddy) మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) అభ్యర్థుల మధ్య చోటు చేసుకొన్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లా తాడూర్ మండలం, సిర్శావాడ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి స్కూల్ నిర్మించారు.

తన ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ (MGR Trust) ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో తాను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కొత్త భవనాన్ని కట్టించారు. దీంతో ఆ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అయితే ప్రభుత్వ పాఠశాల స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించాల్సి ఉండగా.. మాజీ ఎమ్మెల్యేతో ఎలా ప్రారంభించడానికి అనుమతి ఇస్తారని ఎమ్మెల్యే కూచుకుళ్ళ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొని చివరికి కేసు వరకు వెళ్ళాయి.

You may also like

Leave a Comment