ఎన్నికల ప్రచారం అన్నాక ఎవరికి తోచినట్టు వారు ప్రచారాలు నిర్వహించడం కామన్.. అలాగే యుద్ధానికి సిద్దం అయ్యాక ఎదురయ్యే కష్టాలు, పెద్ద మొత్తంలో వస్తున్న సైనిక బలగాలు ఇవేవీ కూడా లక్ష్యాన్ని ఆపలేవు.. అదీగాక మంచి చేయాలనుకునే వారికి ఎప్పుడు ప్రజల అండ ఉంటుందని ఇప్పటి వరకి ఎన్నో సంఘటనలు నిరూపించాయి. ఇదే విషయాన్ని త్వరలో రాబోయే ఎన్నికల రిజల్ట్ రుజువు చేయబోతుందని అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా మాటలతో జనాన్ని ఆకర్షిస్తాడనే పేరున్న కేటీఆర్ (KTR).. మరోసారి తన నోటికి పని చెప్పాడు. ఒక్క కేసీఆర్ (KCR)ను ఓడించేందుకు ఇంత మంది ఏకమవ్వడం విడ్డూరం అని కేటీఆర్ అన్నాడు.. కేసీఆర్ సింగిల్ గానే వస్తడు.. గెలుస్తడు అని ధీమా వ్యక్తం చేశారు. కల్వకుర్తి (Kalvakurti)లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి.. ఇతర రాష్ట్రాల్లో లేదని పేర్కొన్నారు.
కొందరు కేసీఆర్ మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల పోటీలో ఉండనని బీజేపీ (BJP) అధ్యక్షుడు పారిపోయాడన్న కేటీఆర్.. బీజేపీతో వచ్చేది లేదు.. సచ్చేది లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ (Congress) వస్తే కష్టాలను ఆహ్వానించినట్టే అని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందన్న కేటీఆర్.. గిరిజనులకు బంజారాహిల్స్ లో బంజారా భవన్ ను నిర్మిస్తున్నామని తెలిపారు.