Telugu News » Chirmarthi Lingaiah : చిర్రుబుర్రులాడు తున్న చిరుమర్తి.. అంత మాట అన్నావు ఏంటయ్యా..!!

Chirmarthi Lingaiah : చిర్రుబుర్రులాడు తున్న చిరుమర్తి.. అంత మాట అన్నావు ఏంటయ్యా..!!

నకిరేకల్ (Nakirekal) ఎమ్మెల్యే (MLA) చిరుమర్తి లింగయ్య (Chirmarthi Lingaiah) కోమటిరెడ్డి సోదరుల (Komatireddy brothers)పై తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం, నోముల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి, కోమటిరెడ్డి బ్రదర్స్ తనను భౌతికంగా లేకుండా చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

by Venu

గెలుపు ధీమాతో ఉన్న బీఆర్ఎస్ (BRS)కు వలసలు వరుసగా షాకిస్తున్నాయి. అసలు గెలుస్తామో లేదో అనే అనుమానంతో బీఆర్ఎస్ ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అనుకుంటున్నారు. అసలే అమలుకు సాధ్యం కానీ హమీలు ఇస్తూ జనాన్ని మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ పై ప్రతి పక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నట్టు జనం అనుకుంటున్నారు.

ఈ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ (KCR) పార్టీ ప్రతిష్ట దిగజారితే ఓటమి ఖాయమని భావిస్తున్నట్టు ప్రచారం. అందుకే బయట మాత్రం బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ప్రచారం చేసుకుంటున్నట్టు కొందరు అనుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు దూకుడులో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టు ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు నకిరేకల్ (Nakirekal) ఎమ్మెల్యే (MLA) చిరుమర్తి లింగయ్య (Chirmarthi Lingaiah) కోమటిరెడ్డి సోదరుల (Komatireddy brothers)పై తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం, నోముల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిరుమర్తి, కోమటిరెడ్డి బ్రదర్స్ తనను భౌతికంగా లేకుండా చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన చరిత్ర నాకు లేదని చిరుమర్తి లింగయ్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కు కేరాఫ్ అని షాకిచ్చారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పై చిరుమర్తి చేస్తున్న ఆరోపణల్లో ఉన్న నిజం ఏంటో గాని.. కాంగ్రెస్ బలపడుతుందని అందుకే చిరుమర్తి సెంటిమెంట్ తో ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటున్నారు.

You may also like

Leave a Comment