ఉత్తరాంధ్రను సీఎం జగన్(CM Jagan) గంజాయి క్యాపిటల్‌గా మార్చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్ఛాపురంలో టీడీపీ శంఖారావం సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఎర్రబుక్కును చూసి అందరూ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
నాలుగున్నరేళ్ల పాలనలో ఏనాడు గుర్తుకు రాని డీఎస్సీ, ఎన్నికల ముందే గుర్తుకురావడంలో ఆంతర్యం ఏమిటని నారా లోకేష్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర చైతన్యం గల నేలని, ఎందరో మహానుభావులకు పుట్టినిల్లని పేర్కొన్నారు. 2019 ఎన్నికల కంటే ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామంటూ వైసీపీ హామీ ఇచ్చి.. ఇప్పుడు కేవలం 18 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహిస్తున్నారని విమర్శించారు.
జగన్ సిద్దం అంటావ్ … దేనికి సిద్దం..? జైలుకి వెళ్లడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. జగన్ కొత్త నాటకం మొదలు పెట్టారని అన్నారు. మోసానికి, కుట్ర, దగాకి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్‌లా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు సర్వనాశనం అయ్యాయని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో మరో పదేళ్లు వెనక్కు వెళ్లిందన్నారు.
విశాఖ ఉక్కు భూములను కాజేయాలని జగన్ చూస్తున్నారని అన్నారు. శ్రీకాకుళంకు 60 హామీలు ఇచ్చారనీ.. ఏ ఒక్కటైనా పూర్తి చేశారా? మాట ఇచ్చి మడమ తిప్పాడు జగన్ అని విరమ్శించారు. ఐదేళ్లలో ఇచ్ఛాపురానికి వైసీపీ చేసిందేమిటని ప్రశ్నించారు. వంశధార -బాహుదా నదుల అనుసంధానం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జీడి పంటకు మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించారు.
‘‘రెండు నెలలు ఓపిక పట్టండి … తీసేసిన అన్ని పథకాలు పునరుద్దరిస్తాం. నాపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదు. జైల్లో పెడితే చంద్రబాబు భయం బయోడేటాలో లేదని చెప్పారు. పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టేదిలేదన్నారు. వడ్డీతో సహా చెల్లిస్తాం. జ్యుడీషియల్ ఏంక్వైరీ వేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం‘‘ అని నారా లోకేశ్ చెప్పారు. కష్టకాలంలో పవన్ తనకు అండగా నిలిచారని అన్నారు.