Telugu News » Lokesh Love story : తొలిచూపులోనే బ్రాహ్మణికి పడిపోయాను..!

Lokesh Love story : తొలిచూపులోనే బ్రాహ్మణికి పడిపోయాను..!

తెలుగుదేశం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి(National Telugu desam party general secretary) యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి విద్యార్థులు,యువతతో ముచ్చటించారు.

by sai krishna

తెలుగుదేశం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి(National Telugu desam party general secretary) యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి విద్యార్థులు,యువతతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.అయితే ఈ నేపథ్యంలో సరదా సంభాషణలో భాగంగా ఓ విద్యార్థిని లోకేశ్ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. మీకూ బ్రాహ్మణి(Brahmin)గారికి ఫస్ట్ పెళ్లి ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారని అడుగగా.. లోకేశ్ స్పందించారు.


బ్రహ్మణితో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్(Love at first sight) అన్నారు. ఇంట్లో అంతా ఓ వెకేషన్కి వెళ్లినప్పుడు పెళ్లి విషయంలో నా అభిప్రాయం అడిగారు..నేను ఒప్పుకున్నాను బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది.. ఇంకా అలా మా పెళ్లి అయిందని ఆ యువతి అడిగిన ప్రశ్నకు సరదాగా నవ్వుతూ జవాబు ఇచ్చారు.

ఆ తర్వాత వేరే యువతి లోకేశ్ మొదటి క్రష్ అని అడగగా.. సభా ప్రాంగణం అంతా యువత అరుపులతో మార్మొగిపోయింది. ఆ ప్రశ్నకు స్పందించిన లోకేశ్.. నాకు చాలా మంది క్రష్లు ఉన్నారని అన్నారు.

కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు చేయ్యాల్సిన పనులు అన్నీ చేశానని.. కాలేజీ లైఫ్ అంటే ఎంజాయ్ చేయ్యాలని అన్నారు. ఈ మేరకు యువత అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానం చెప్పి వారిలో ఉత్సాహాన్ని నింపారు.

You may also like

Leave a Comment