Telugu News » Black water :సెలబ్రిటీలు తాగేది బ్లాక్ వాటరా..!? అది అంత స్పెషలా..!?

Black water :సెలబ్రిటీలు తాగేది బ్లాక్ వాటరా..!? అది అంత స్పెషలా..!?

స్వచ్ఛమైన నీటికి రంగు,రుచి,వాసన వంటి లక్షణాలు ఉండవు. అదే స్వచ్ఛమైన నీటికి ఉండే అచ్చమైన లక్షణం. అయితే మరి సెలబ్రిటీలంతా బ్లాక్ వాటర్(Black water) తాగుతారట..!

by sai krishna

స్వచ్ఛమైన నీటికి రంగు,రుచి,వాసన వంటి లక్షణాలు ఉండవు. అదే స్వచ్ఛమైన నీటికి ఉండే అచ్చమైన లక్షణం. అయితే మరి సెలబ్రిటీలంతా బ్లాక్ వాటర్(Black water) తాగుతారట..!

అది చాలా ఖరీదట..ఇంతకీ ఆ వాటర్ని ఎక్కడ నుంచి తెస్తారట..!? లాంటి ఎన్నో ప్రశ్నమనసులో రోల్ అవుతున్నాయ్ కదా.!? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చాలామంది సినీ తారల సీక్రెట్‌ బ్లాక్‌ వాటర్‌ తీసుకుంటారు..!వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..ఆస్తులు అమ్మైనా ఆ వాటరే తాగుతాం అంటారు.

సాధారణ మనం తాగే మంచినీళ్లలో ph స్థాయి 7 ఉంటే..ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట. అలానే బాడీని హైడ్రేటెడ్‌(Hydrated), ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది.

ఇందులో ఉండే 70% ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియ(digestive process)ని మెరుగుపరుస్తుంది.శరీరానికి సరిపడా ఈ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర(Gastrointestinal) ప్రేగు సమస్యలను నివారిస్తుంది.

బ్లాక్‌ వాటర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్‌ వాటర్‌ సహాయపడుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వేసవిలో ఈ నీటిని ఎక్కువగా తీసుకుంటే.. సన్‌స్ట్రోక్‌ నుంచి బయటపడవచ్చు. బ్లాక్‌ వాటర్‌ శరీర వేడిని తగ్గిస్తుంది.

బ్లాక్‌ వాటర్‌ రక్తపోటును అదుపులో ఉంచడం, కీళ్లలో జిగురు పెంచడంలోనూ శరీర కీలకమైన విధుల్లో పాల్గొంటుంది. జీవక్రియ, నాడీ సంబంధిత(Neurological) విధులను మారుస్తుంది.

మనం రోజూ తీసుకునే నీటిలో సాధారణంగా నాన్ కర్బన్ సాల్ట్స్ ఉంటాయి.
అయితే బ్లాక్ వాటర్ లో నీరు ఎక్కువ ఆల్కలిన్‌గా ఉంటుంది. అందువల్ల బ్లాక్‌ వాటర్‌ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

అందుకే, పలువురు హీరోయిన్లు మలైకా అరోరా, ఊర్వశి రౌతేలా, శ్రుతి హాసన్ తదితరులు కూడా ఈ బ్లాక్ వాటర్‌ని తాగుతున్నారట. భారత్‌లో విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుతం బ్లాక్ వాటర్ తాగుతున్న జాబితా కూడా గత కొన్ని నెలల నుంచి క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment