నయనతార ముఖ్య పాత్రలో నటించిన అన్నపూర్ణి (Annapoorni) మూవీ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఈ చిత్రం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో నయనతార పై కేసు కూడా నమోదు అయ్యింది. అదీగాక ఈ మూవీలో శ్రీరాముడిని అవమానిస్తూ లవ్ జిహాద్‌ను ప్రోత్సహించే రీతిలో కొన్ని సీన్లున్నాయనే టాక్ ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో నటి నయనతార (Nayanthara) స్పందించారు.. తన్ ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా క్షమాపణ లేఖను రిలీజ్ చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు గానీ, చిత్ర బృందానికి గానీ లేదని.. పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్నినిర్మించినట్టు తెలిపారు.. తెలియకుండానే ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించమని పేర్కొన్నారు..
విమర్శలు వస్తున్న క్రమంలో ఈ చిత్రాన్ని ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించడాన్ని తాము ఊహించలేదన్నారు. తాను దేవుడిని విశ్వసిస్తానని, దేశంలోని ఆలయాలను తరుచూ విజిట్ చేస్తుంటానని, కావాలని చేయలేదని, ఎవరి మనసును బాధపెట్టినా.. వారందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు నయనతార ఇన్‌స్టాలో వెల్లడించారు. మరోవైపు డిసెంబర్ ఒకటో తేదీన అన్నపూర్ణి చిత్రం థియేటర్లలో విడుదల అయ్యింది.
డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఈ చిత్రంలో ఉన్నాయని ఆరోపణలు గుప్పుమన్నాయి.. బిర్యానీ వండేందుకు ఓ సీనులో నటి హిజాబ్ ధరించి నమాజ్ చేస్తుంది. రాముడు, సీత మాంసం తిన్నారని, నటితో ఆమె ఫ్రెండ్ మాంసాన్ని కట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాడు. సినిమాలో ఈ సీన్ లవ్ జిహాద్‌ను ప్రమోట్ చేసినట్లు ఉందని కొందరు తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ చిత్రం వివాదాస్పదంగా మారింది..