ఈ సంవత్సరపు జ్ఞాపకాలు తుడిచి పెట్టుకుపోవడానికి పదకొండు రోజుల సమయం మాత్రమే ఉంది. అదేనండీ కొత్త క్యాలెండర్ మారడానికి అన్న మాట.. అయితే ఇప్పటి నుంచే కొత్త సంవత్సరంలో కొత్తగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ప్లాన్ లో మునిగి తెలుతున్నారు యూత్.. అయితే మీ ఎంజాయ్.. ఎండ్ జాయ్ కాకుండా ఉండడానికి ఈసారి పోలీసులు చర్యలు గట్టిగానే తీసుకొనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సిటీలో జరిగే న్యూ ఇయర్ (New Year) వేడుకలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
హైదరాబాద్ (Hyderabad) సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి (CP Kottakota Srinivas Reddy) మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్లానింగ్ రూపొందించారు. ఈవెంట్లలో మహిళల సెక్యూరిటీ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ వాడకంపై నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించాలని గైడ్‌లైన్స్ జారీ చేశారు.
నిర్వాహకులకు ఇందుకు సంబంధించి పబ్స్ సమాచారం ఇచ్చారు. ఈవెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేసిన అధికారులు.. కెపాసిటీకి మించి పాసులు జారీ చేయవద్దని, సెమీ న్యూడ్ డ్యాన్స్ లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సిస్టమ్ నుంచి సౌండ్ 45 డెసిబుల్స్ దాటొద్దని సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అలాగే మైనర్లను ఈవెంట్లకు అనుమతించవద్దని ఆదేశించారు. డ్రగ్స్ కస్టమర్లు, సప్లయర్లపై నిఘా పెట్టామన్న సీపీ.. రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకొనున్నట్టు వెల్లడించారు.. స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ (Drunk drive) తనిఖీలు డిసెంబర్ 31 రాత్రి నిర్వహిస్తామని తెలిపారు.
మద్యం తాగి వెహికల్ నడిపే వారికి సీపీ శ్రీనివాస్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు.. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో భాగంగా.. బ్రీత్ అనలైజర్ టెస్టులో 30 ఎంజీ ఆల్కహల్ కంటెంట్ వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. మరోవైపు మద్యం మత్తులో ఉన్న వారిని టెంపరరీ కస్టడీకి తీసుకొని.. కేసులు నమోదు చేసి వారిని కోర్టులో ప్రవేశపెడతామని సీపీ తెలిపారు.. వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడంతో పాటు రూ.10 వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుందని సీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు..