రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.. మరోవైపు స్వయంకృతాపరాధం తో ఓటమిని మూటగట్టున్న బీఆర్ఎస్ (BRS)..ఓటమికి చింతిస్తూ.. ఇక నుంచి ముందుకు ఎలా వెళ్లాలనే ప్రణాళికలను సిద్దం చేసుకుంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించాలనే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే కేటీఆర్ (KTR) ఈ విషయం గురించి ప్రస్తావించగా.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేయక పోయినా.. రాష్ట్రంలో ఒక్క గంట కరెంట్ ఆగినా వెంటాడుతాం.. వేటాడుతామని తెలిపారు. వనపర్తి (Wanaparthi) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుబంధు ఇవ్వాలని హుకుం జారీచేశారు..
మరోవైపు వ్యవసాయం గెలిచినప్పుడు ఎగరలేదు.. ఓడినప్పుడు బాధపడనని తెలిపిన నిరంజన్ రెడ్డి.. నా ఓటమి నన్ను బాధపెట్టలేదు. కానీ, కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం బాగా కలచివేసిందన్నారు.. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు కామన్ అని పేర్కొన్న నిరంజన్ రెడ్డి.. ఓడిపోయానని ఎక్కడికి వెళ్లను.. గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోస పోయామనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నామని.. ఎన్నికల ఫలితాలను సమీక్షించుకొని ముందుకెళ్తామన్నారు.. మళ్ళీ అధికారంలోకి రావడాని శాయశక్తులా ప్రయత్నిస్తామని తెలిపిన నిరంజన్ రెడ్డి.. ప్రజల పక్షాన పోరాటం చేసే సమయం ఆసన్నమైందని వెల్లడించారు..