Telugu News » Nandigama : నందిగామలో భారీ అగ్ని ప్రమాదం..!

Nandigama : నందిగామలో భారీ అగ్ని ప్రమాదం..!

ఈ రోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ (NTR)జిల్లా నందిగామ (Nandigama)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీబాలాజీ డోర్స్ అండ్ ప్లేవుడ్ షాప్‌ (Plywood Shop)లో అగ్నిప్రమాదం సంభ‌వించింది.

by Venu

ఈ మధ్యకాలంలో తరచుగా అగ్నిప్రమాదాలు (Fire accidents)చోటు చేసుకొంటున్నాయని వస్తున్న వార్తలు ప్రజలను కొంత కలవరానికి గురిచేస్తున్నాయి. లోపం ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ ఈ ప్రమాదాల వల్ల ఒక్కోసారి ప్రాణ నష్టం, ఆస్తి (property) నష్టం జరుగుతోంది. ఆస్తి కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు అయితే తీసుకురాలేం కదా..!

ఇక ఈ రోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ (NTR)జిల్లా నందిగామ (Nandigama)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీబాలాజీ డోర్స్ అండ్ ప్లేవుడ్ షాప్‌ (Plywood Shop)లో అగ్నిప్రమాదం సంభ‌వించింది. ప్రమాదం కారణంగా షాప్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.. అసలే ప్లైవుడ్ షాప్ కావ‌డం వల్ల మంటలకు పూర్తిగా దగ్ధమైంది. ఎట్టకేలకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా సుమారు 80లక్షల నుండి కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు షాప్‌ నిర్వాహకులు తెలియజేశారు.

You may also like

Leave a Comment